సౌత్ సినిమాలపై తమన్నా షాకింగ్ కామెంట్స్, అందుకే సినిమాలు తగ్గించేసిందిట

First Published | Sep 28, 2023, 7:59 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సౌత్ పరిశ్రమపై  షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమంది.అనాల్సిన అవసరం ఏమొచ్చింది

Tamannaah Bhatia


ఇక్కడ సౌత్ లో సినిమాలు చేసి గుర్తింపు, డబ్బు పొంది ఇక్కడవారిని విమర్శించటం ,కామెంట్స్ చేయటం ముంబై హీరోయిన్స్ కు కామన్ గా మారింది. ఆ మధ్య తాప్సీ  సౌత్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ అందరిని ఎలా ఇబ్బందిపెట్టాయో..ఇప్పుడు తమన్నా చేసిన కామెంట్స్ కూడా అలా వైరల్ అవుతున్నాయి.  ఇక్కడ తను చేసిన సినిమాలపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది.


మొదట్లో హిందీ  సినిమాలతో సినీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా అక్కడ వర్కవుట్ కాక.. ఆ తర్వాత  తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి  క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది.అయితే అక్కడ ఆమెకు పెద్దగా కలిసిరాకపోయినా ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది.  ఇక తమన్నా ప్రస్తుతం ‘బంద్రా’, ‘అరన్మణై4’, ‘వేడా’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 


Tamannaah Bhatia


 ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది అందాల తార తమన్నా. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో సినిమాలు చేస్తుంది తమన్నా. తెలుగు లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. దక్షిణాది, బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది నటి తమన్నా (Tamannaah).

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. నటి కావాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగుపెట్టానని.. ఇప్పుడు తానొక స్టార్‌ని అయ్యానని అన్నారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే తాను ఇప్పటికీ శ్రమిస్తున్నానని చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు వదిలేసుకుంటున్నాను అంది. అందుకు కారణం సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ‘‘అక్కడ పురుషాధిక్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు’’ అంది.

‘దక్షిణాదిలో హీరోయిజాన్ని హైప్‌ చేసే సినిమాలు ఎక్కువగా ఉంటాయి కదా. హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కారణంగా మీరు నటించనని ఎప్పుడైనా చెప్పారా?’ అని మీడియా వ్యక్తి ప్రశ్నించగా.. ‘‘సౌత్ లో సులువుగా ఉండే కొన్ని ఫార్ములాలు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని కమర్షియల్‌ సినిమాల్లో నా పాత్రకు ఇబ్బంది లేకుండా.. హీరోయిజం తీవ్రతను తగ్గించమని దర్శకులను కోరిన సందర్భాలు ఉన్నాయి. రాను రాను ఇలాంటి సన్నివేశాలు చేయడం మానేశా. అలాంటి సినిమాలకూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ అని ఆమె రిప్లై ఇచ్చింది.

Tamannaah Bhatia

అలాగే ఆమె మాట్లాడుతూ..‘‘కొన్ని కమర్షియల్ సినిమాల్లో నేను నా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. అందుకే మేకర్స్‌ను నా క్యారెక్టర్ తగ్గించమని కోరేదాన్ని. అలా చూసి చూసి మెల్లగా అలాంటి పాత్రలు చేయడమే మానేశాను. విషపూరితమైన పురుషాధిక్యతని సెలబ్రేట్ చేసుకొనే సినిమాల్లో భాగం కాకూడదని చేతనైన ప్రయత్నం చేస్తున్నా’’ అని తమన్నా సౌత్‌లోని కమర్షియల్ సినిమాలపై  షాకింగ్  చేసింది. 


అయితే సౌత్‌లో వచ్చినంత ఫేమ్.. తమన్నాకు బాలీవుడ్‌లో రాలేదు. ఆ అంశంపై కూడా తను స్పందించింది.తను సక్సెస్, ఫ్లాప్స్‌ను పర్సనల్‌గా తీసుకోను అని అంది తమన్నా. తను బాలీవుడ్‌లో మొదట్లో చేసిన సినిమాలు వర్కవుట్ అవ్వకపోయినా.. అది తన తలరాత అనుకొని యాక్టింగ్ చేస్తూనే ఉన్నానని చెప్పింది. 

 
 బాలీవుడ్‌లో సక్సెస్‌ కాలేకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో నేను నటించిన పలు సినిమాలు సరిగ్గా ఆడలేదు. అది విధి. దానిని నేను వ్యక్తిగత ఫెయిల్యూర్‌గా ఎప్పటికీ తీసుకోను ఎందుకంటే, ఎంతోమంది కలిసి వర్క్‌ చేస్తేనే ఒక సినిమా సిద్ధం అవుతుంది’’ అని ఆమె చెప్పారు.  ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ ల్లో ఏకంగా బెడ్ సీన్లలో నటించి ఆశ్చర్యపరిచింది.

 
  ‘‘నేను జీవించే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. నేను దీనిని అలాగే చూస్తాను. 17 ఏళ్లు అయినా కూడా నేను ఇప్పటికీ లేచి ఇదే మళ్లీ మళ్లీ కావాలనుకుంటాను. యాక్టింగ్ అనేది నా ప్యాషన్. నేను కెమెరా ముందుకు వెళ్లడానికే నిద్రలేస్తాను. అదే నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది.’’అని  చెప్పింది తమన్నా.  ఇక రీసెంట్ గా మాత్రం ‘ఆఖ్రీ సచ్’ అనే సిరీస్ తోనూ అలరిస్తోంది. ప్రస్తుతం ‘బంద్రా’, ‘ఆరణ్మనై 4’, ‘వేడా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం జైలర్ (Jailer). ఈ ఏడాది నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన పాటల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది జైలర్‌ సాంగ్‌ నువ్‌ కావాలయ్య (Kaavaalaa). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna bhatia) ఈ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్ చేసింది. మ్యూజిక్ లవర్స్‌, తమన్నా ఫ్యాన్స్ కు ఈ పాట తెగ నచ్చేసింది.

కావాలా సాంగ్‌ వేల సంఖ్యలో నెట్టింట రీల్స్‌ దర్శనమిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమన్నా డ్యాన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇండియాతోపాటు విదేశాల్లో కూడా ఈ సాంగ్‌ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ ఫీవర్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో చిరతో చేసిన భోళా శంకర్ చిత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది.

బాలీవుడ్ డైరెక్టర్ అరునిమా శర్మ దర్శకత్వంలో ఓటీటీ వేదిక ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ‘జీ కర్దా’లో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, సిరీస్ చూసిన ఆడియెన్స్ కు తమన్నా తెగింపు చూసి షాక్ తగిలింది. 
 

Latest Videos

click me!