అయినా వీరిద్దరూ కలసి సినిమాలు నిర్మిస్తూ ముందుకు వెళుతున్నారు. తన గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా పూరి వాటిని పట్టించుకోని నైజం. తన పని తాను చేసుకుని వెళుతున్నారు. ఇప్పుడు పూరి జగన్నాధ్ లైగర్ ఫ్లాప్ నుంచి బయట పడి మరోసారి సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో తొలి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు.