Ram-Rashmika Combo: రామ్ తో రష్మిక మందన్న రొమాన్స్... బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా...?

First Published | Mar 16, 2022, 7:10 AM IST

కొన్ని కాంబినేషన్లు రేర్ గా కనిపిస్తుంటాయి.. వాటిని సెట్ చేసే టైమ్ రావాలి అంతే. అలాంటి కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ బోయపాటి. రామ్(Ram) కు జతగా రష్మి(Rashmika)కను చూపించబోతున్నారు. 
 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌(Rm) పోతినేని, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను(Boyapati Srinu) డైరెక్షన్ లో  ఓ సినిమా తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.  అయితే ఈ సినిమాలో రామ్ జోడీగా ఎవరు నటిస్తున్నారు అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టీమ్. అంతే కాదు మిగతా ఆర్టిస్ట్ లు  ఎవరు అన్నది కూడా చెప్పలేదు. 

ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్(Ram) సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల మీద దృష్టి పెట్టారట. అందులో భాగంగా ఈ సినిమాకి కావల్సిన ఆర్టిస్ట్ లు.. టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మాస్ డైరెక్టర్. ఇక ఇందులో భాగంగా హీరోయిన్ ను ఫైనలేజ్ చేసేశాడట బోయపాటి. 


ఈ సినిమాలో రామ్‌(Ram) సరసన నేషనల్‌ క్రష్‌ రష్మిక నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి రష్మి(Rashmika)కకు కథ వినిపించాడని, ఆమెకు నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.ఈ కాంబినేషన్ అసలు ఎవరూ ఊహించనిది రామ్ , రష్మిక, బోయపాటి ఎవరు ఎవరితో ఇంత వరకు సినిమా చేయలేదు. 

వీరు ముగ్గురి కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బోయాపాటి. ఫస్ట్ టైమ్ రామ్(Ram), బోయపాటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. రష్మి(Rashmika) క ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. 

టాలీవుడ్ హీరో అయినా.. రామ్‌(Ram)కి బాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు హిందీలో డబ్‌ అయి, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ని సాధించాయి. ఈరకంగా రామ్(Ram) కు హిందీలో ఫ్యాన్స్ ఉన్నారు.  అందుకున్నాయి. 
 

ఇక రష్మిక(Rashmika)కు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అల్లు అర్జున్(Allu Arjun) పుష్పతో రష్మిక నేషనల్  క్రష్‌గా మారింది. అసలు  పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రష్మిక(Rashmika)ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక కూడా పాన్ ఇండియా మూవీ కాబట్టి.. అందులోను బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ సినిమాలో చేయాలన్న ఇంట్రెస్ట్ తో ఒకే చేసినట్టు సమాచారం. 

ఇక రష్మిక(Rashmika) రీసెంట్ గా శర్వానంద్‌తో కలిసి నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక  ప్రస్తుతం పుష్ప 3తో పాటు బాలీవుడ్‌ కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఎక్కువగా బాలీవుడ్ పై దృష్టి పెట్టింది కన్నడ కస్తూరి. 
 

ఇక రామ్(Ram), బోయపాటి శ్రీను కాంబో మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్(Ram) హీరోగా ద వారియర్ సినిమాను నిర్మిస్తున్నది కూడా ఆయనే. ఈసినిమా రిలీజ్ కు ముస్తాబవుతుంది. 

Latest Videos

click me!