తొడగొట్టి సవాల్‌ విసిరిన `జబర్దస్త్` రోజా.. సుడిగాలి సుధీర్‌ షాకింగ్‌ కామెంట్‌.. నోరెళ్ల బెట్టిన యాంకర్ రష్మి

Published : Mar 15, 2022, 09:09 PM ISTUpdated : Mar 16, 2022, 05:02 PM IST

రోజా అంటే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌. ఫైర్‌ బ్రాండ్‌ అనే ట్యాగ్‌ కూడా ఉంది. అలాంటిది ఆమె ముందే వేషాలేయగలరా? అలాంటి వేషాలేయబోయిన సుడిగాలి సుధీర్‌కి తొడగొట్టి మరీ సవాల్‌ విసిరింది రోజా. 

PREV
18
తొడగొట్టి సవాల్‌ విసిరిన `జబర్దస్త్` రోజా.. సుడిగాలి సుధీర్‌ షాకింగ్‌ కామెంట్‌.. నోరెళ్ల బెట్టిన యాంకర్ రష్మి

`జబర్దస్త్`లో రోజా జడ్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచీ ఆమె జడ్జ్ గా ఉంటూ తనదైన పంచ్‌లు, కామెంట్లతో షోని రక్తికట్టిస్తూ నవ్వులు పూయిస్తుంది. ఆమెతోపాటు మనో జడ్జ్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆమని చేరారు. ఇద్దరూ అక్కా చెల్లెలు మాదిరిగా మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా రోజా, ఆమనిసైతం కామెడీ చేయడం విశేషం. 

28

`ఎక్స్ ట్రా జబర్దస్త్` ఈ నెల 18న శుక్రవారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో రోజా, ఆమనిలు కూడా సుడిగాలి సుధీర్‌, రామ్‌ ప్రసాద్‌తో కలిసి స్కిట్‌ చేశారు. తమదైన స్టయిల్‌లో నవ్వులు పూయించారు. కొన్ని చోట్ల దొరికిపోయిన వీరిద్దరని రామ్‌ప్రసాద్‌, సుడిగాలి సుధీర్‌ ఆడుకున్నారు. పంచ్‌లతో పరువు తీసేశారు. ఈ క్రమంలోనే రోజా సుధీర్‌కి సవాల్‌ విసురుతూ తొడగొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఇంతకి ఏం జరిగిందంటే.. 
 

38

`ఆచార్య` చిత్రంలో లాహే లాహే.. పాటకి రోజా-రామ్‌ప్రసాద్‌, ఆమని-సుడిగాలి సుధీర్‌ జోడీగా స్టేజ్‌పైకి వచ్చారు. తమదైన స్టెప్పులతో అలరించారు. షోకి జోష్‌ని నింపారు. ఇందులో వచ్చీ రావడంతోనే రోజా ఏంట్రీ ఎందుకు పిలిచావ్‌, అని రాంప్రసాద్‌ని రోజా అడిగింది. అక్కా వాడుచూడు మనతో గొడపడుతున్నాడు అని సుడిగాలి సుధీర్‌ని చూపిస్తూ రాంప్రసాద్‌ రోజాకి చెప్పాడు.  

48

దీంతో ఎవడ్రా అది అంటూ రోజా ఫైర్‌ అవుతూ తొడగొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఇది చూసి పక్కనే ఉన్న రామ్‌ ప్రసాద్‌ సైతం నోరెళ్లబెట్టారు. మరోవైపు యాంకర్‌ రష్మిగౌతమ్‌ సైతం నోరెళ్ల బెట్టింది. ఆశ్చర్యం, షాక్‌ కలగలిపిన ఫీలింగ్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌ హైలైట్‌గా నిలిచింది. వీరితోపాటు సుధీర్‌ కూడా షాక్‌ తిన్నాడు. ఆమె చూసి భయపడుతూ వెనక్కి అడుగులు వేశాడు. 

58

ఇది చూసిన రామ్‌ ప్రసాద్‌ `అక్క వాడు ఓ అడుగు వెనక్కి వేశాడక్కా` అని అన్నాడు. దీనికి సుధీర్‌కి రోషం వచ్చింది. `హలో పులి ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే పది అడుగులు ముందుకేస్తాదంటూ రెచ్చిపోయాడు. దీంతో ఘోళ్లున్న నవ్విన రోజా.. పులి గురించి పులిరాజు చెబుతుంటే నవ్వొస్తుందనడంతో సుడిగాలి సుధీర్‌, ఆమని సైతం ఫేస్‌ మాడిపోయింది. దీంతో రియాక్ట్ అయిన ఆమని ఏమి లేని ఆమె ఎగిరెగిరి పడిందట అనడంతో నవ్వులు పూశాయి. 
 

68

ఇక సామెతలు కాదుగానీ, ఇంకా ఏదైనా చెప్పాలని సుధీర్‌ అన్నాడు. దీంతో రామ్‌ ప్రసాద్‌ని తీసుకెళ్లిన రోజా ఇటు రారా నీకో కథ చెబుతా అంటూ ట్రైన్‌ పట్టాలపై ఓ వ్యక్తిని ట్రైన్‌ గుద్దిన స్టోరీ చెప్పింది. దీని వల్ల ఏం అర్థమైందని అడగ్గా, ట్రైన్‌ని ఫ్లాట్‌ఫామ్‌ మీదే ఎక్కాలని, పట్టాలపై కాదని అర్థమైందని చెప్పడంతో రోజా రామ్‌ ప్రసాద్‌ తలపై ఒక్కటేసింది. 
 

78

రోజాని చూసిన ఆమని సైతం రెచ్చిపోయింది. తాను ఓ కథ చెబుతా అంటూ సుధీర్‌కి రాజు, చేపల కథ చెప్పింది. ఏడుగురు కొడుకు, ఆరు చెపలంటూ చెప్పింది. ఇది విన్న సుడిగాలి సుధీర్‌.. అక్క ఆమె లాగా నీకు కథలు చెప్పడం రాదంటూ కామెంట్‌ చేయడంతో షాక్‌ తిన్నది ఆమని. ఈ స్కిట్‌ నవ్వులు పూయించింది. `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమోలోని ఈ ఎపిసోడ్స్ ఆద్యంతం నవ్వులు పూయించాయి. 

88

రోజా తొడగొట్టడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న యాంకర్‌ రష్మి. వీరి స్కిట్‌ని, పంచ్‌లు డైలాగ్‌లను చూసి ఆమె బాగా ఎంజాయ్‌ చేసింది. సీట్‌పై పడిపడి నవ్వడం విశేషం. `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి రష్మి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విష

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories