ఓ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ ఫ్లాప్ మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రానికి అనవసరంగా 400 కోట్ల బడ్జెట్ పెట్టారు అని అన్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ? ఏ మూవీ గురించి కామెంట్స్ చేశారు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
భారీ బడ్జెట్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలు చాలా వరకు అంచనాలు అందుకోలేకున్నాయి. పాన్ ఇండియా చిత్రాల మత్తులో ఫిలిం మేకర్స్ వందల కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారు. మీడియం బడ్జెట్ లో తీయాల్సిన చిత్రాలని కూడా పాన్ ఇండియా చిత్రాల పేరుతో చంపేస్తున్నారు అని క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
ప్రభాస్ మూవీపై వర్మ కామెంట్స్
రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాలని నిర్మొహమాటంగా చెబుతుంటారు. కొన్నిసార్లు వర్మ తన కామెంట్స్ తో వివాదాల్లో చిక్కుకోవడం కూడా చూస్తున్నాం. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంపై గతంలో వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కింది. 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది.
35
రాజ్ తరుణ్ లాంటి హీరో నటించాల్సిన మూవీ
ఆ మూవీ నిరాశ పరచడానికి గల కారణాన్ని వర్మ వివరించారు. వర్మ మాట్లాడుతూ రాధేశ్యామ్ అనేది ఒక సింపుల్ లవ్ స్టోరీ. అది రాజ్ తరుణ్ లాంటి హీరో చేయాల్సిన సినిమా. కొందరు ఫిలిం మేకర్స్ ప్రతి సినిమా టైటానిక్ లాగా, ఇన్సెప్షన్ లాగా ఉండాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. దీని వల్ల స్టార్ హీరోల స్టార్ డమ్ ని పణంగా పెడుతున్నారు.
రాధేశ్యామ్ చిత్రాన్ని రాజ్ తరుణ్ లాంటి హీరోతో చేసి ఉంటే ఎలా ఉండేది ? ఆ చిత్రాన్ని ప్రభాస్ తో తీయాలనుకోవడం వల్ల భారీ స్థాయిలో ఉండాలని 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. 400 కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అది లవ్ స్టోరీనా , వేరే జోనరా అనేది ఆడియన్స్ కి అనవసరం.. అంత బడ్జెట్ పెడితే ఆ మూవీ కూడా బాహుబలి రేంజ్ లో ఉండాలని ఆశిస్తారు. అక్కడే తప్పు జరిగింది అని రాధేశ్యామ్ ఫ్లాప్ గురించి వర్మ కామెంట్స్ చేశారు.
55
కథాంశం ఇదే
రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికా నిపుణుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీలక పాత్రలో నటించారు. ఎంతటివారి జాతకాన్ని అయినా హస్త రేఖలను బట్టి చెప్పేసే విక్రమాదిత్య( ప్రభాస్) జీవితాన్ని ప్రేమ ఎలా ప్రభావితం చేసింది.. అతడి జాతకం ఎలా మారింది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.