Sirivennela: 3 సెకండ్లలోనే ఆ పాట, పొరపాటున స్వర్గానికి వెళితే.. సిరివెన్నెలపై ఆర్జీవీ కామెంట్స్

First Published Dec 1, 2021, 9:45 AM IST

తెలుగు పదాలతో మ్యాజిక్ చేసి శిఖరాగ్రానికి చేరుకున్న పాటల రచయిత సిరివెన్నెల ఇక లేరు అంటే అందరికీ జీర్ణించుకోవడం కష్టంగా మారింది. మంగళవారం కిమ్స్ లో చికిత్స పొందుతూ సిరివెన్నెల మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు సాహిత్యానికి ఇది చీకటి రోజు అంటూ దేశం నలువైపుల నుంచి సిరివెన్నెల మృతికి సంతాపాలు అందుతున్నాయి.

sirivennela seetharama sastry

తెలుగు పదాలతో మ్యాజిక్ చేసి శిఖరాగ్రానికి చేరుకున్న పాటల రచయిత సిరివెన్నెల ఇక లేరు అంటే అందరికీ జీర్ణించుకోవడం కష్టంగా మారింది. మంగళవారం కిమ్స్ లో చికిత్స పొందుతూ సిరివెన్నెల మృతి చెందిన సంగతి తెలిసిందే. తెలుగు సాహిత్యానికి ఇది చీకటి రోజు అంటూ దేశం నలువైపుల నుంచి సిరివెన్నెల మృతికి సంతాపాలు అందుతున్నాయి. సిరివెన్నెలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి, కె విశ్వనాధ్ లాంటి ప్రముఖులు భావోద్వేగానికి గురయ్యారు. 

ఎలాంటి సందర్భంలోనూ ఎమోషనల్ అవ్వని రాంగోపాల్ వర్మ సిరివెన్నెల మృతి పట్ల తనదైన శైలిలో స్పందించారు. సిరివెన్నెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల మరణించారని ఎవరూ బాధపడక్కర్లేదు. ఆయన ఇక్కడి కంటే ది బెస్ట్ ప్లేస్ స్వర్గానికి వెళ్లారు అని వర్మ తెలిపారు. 

వర్మ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల అద్భుతమైన సాహిత్యం అందించారు. వాటిని వర్మ గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ చెట్టుకింద కూర్చుని శివ చిత్రం కోసం సన్నివేశం వివరించా. పాట కవిత్వంలాగా ఉండకుండా కాలేజీ కుర్రాళ్లు మాట్లాడుకున్నట్లు ఉండాలి అని చెప్పా.. నేను చెప్పిన మూడు సెకండ్లలోనే సిరివెన్నెల గారు ' బోటనీ పాఠముంది మాటని ఆట ఉంది' అంటూ సాంగ్ స్టార్ట్ చేసేశారు అని వర్మ వివరించాడు. 

వర్మ తెరకెక్కించిన గాయం చిత్రంలో 'సురాజ్యమవలేని స్వరాజ్యం ఎందుకు' పాటకి సిరివెన్నెల నంది అవార్డు అందుకున్నారు. అదే మూవీలో మోస్ట్ పాపులర్ సాంగ్ 'నిగ్గదీసి అడుగు' సాంగ్ ని రచించింది కూడా సిరివెన్నెలే. వర్మ, వెంకటేష్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన క్షణక్షణం చిత్రంలో ఎవర్ గ్రీన్ సాంగ్ 'జామురాతిరి జాబిలమ్మ' పాట సిరివెన్నెల కలం నుంచి వచ్చిందే. 

సిరివెన్నెల మృతిపై వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ.. నేను ఖచ్చితంగా స్వర్గానికి రాను. మీరు మాత్రం స్వర్గానికే వెళ్లి ఉంటారు. ఒక వేళ యముడు, చిత్రగుప్తుడు లెక్కలో పొరపాట్లు జరిగి పొరపాటున నేను స్వర్గానికి వస్తే మనమిద్దరం ఒక పెగ్ అమృతం వేద్దాం సిరివెన్నెల గారు అని వర్మ తెలిపారు. సిరివెన్నెల గురించి స్పందిస్తూ వర్మ సోషల్ మీడియాలో ఆడియో సందేశం పోస్ట్ చేశారు. 

మీరు ఎక్కడికో వెళ్లిపోయారని ఈ జనాలంతా హాఫ్ బ్రెయిన్ తో ఏడుస్తున్నారు. కొంతమంది దుబాయ్ వెళతారు, మరికొంతమంది మరో ప్రదేశానికి టూర్ వెళతారు. కానీ మీరు ది బెస్ట్ ప్లేస్ స్వర్గానికి వెళ్లారు అంటూ వర్మ తెలిపారు. 

click me!