సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన తాజా చిత్రం పవర్ స్టార్. లాక్ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస సినిమాలతో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నేక్డ్ సినిమాలను రిలీజ్ చేసిన వర్మ తాజాగా పవర్ స్టార్‌తో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తొలి పోస్టర్ నుంచే వివాదానికి తెర లేపిన వర్మ, సినిమా రిలీజ్‌కు ముందు మరింతగా రచ్చ చేశాడు.
undefined
పవన్ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో రెచ్చగొట్టిన వర్మ, సిచ్యువేషన్‌ను భౌతిక దాడుల వరకు తీసుకువచ్చాడు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు వర్మ ఆఫీసు మీద దాడి చేయటంతో సినిమాకు ఓ రేంజ్ పబ్లిసిటీ వచ్చింది. వర్మ ఆశించిన ఫలితం దక్కింది. అదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు వర్మ. తన ఆఫీసు మీద దాడి చేసిన వారిని కౌగిలించుకోవాలని ఉంది, ముద్దు పెట్టుకోవాలని ఉంది అంటూ ట్వీట్లు చేశాడు.
undefined
ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా పవర్ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా పెద్దగా మెప్పించే సినిమా కాకపోయినా వర్మ మార్క్ సీన్స్ అక్కడక్కడ మెరవటం కాస్త పరవాలేదనిపిస్తోంది. అయితే వివాదాలు, గొడవలతో వర్మ తాను అనుకున్న రేంజ్ సక్సెస్ మాత్రం సాధించాడు. వర్మ ఏదో చూపిస్తాడని ఆశించిన సినీ జనాలు పవర్‌స్టార్‌ను ఎగబడి చూశారు. దీంతో వర్మ తను అనుకున్న యాంగిల్ సక్సెస్ అయ్యాడు.
undefined
అదే విషయాన్ని గర్వంగా ప్రకటించుకున్నాడు వర్మ. పవర్ స్టార్ ఏటీటీ బ్లాక్ బస్టర్ అంటూ ప్రకటించేశాడు. అంతేకాదు. ఇండస్ట్రీ చేంజర్, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, పవర్ ఫుల్ హిట్, మెగా పవర్ హిట్, ఇండస్ట్రీ బ్లాస్టర్ అంటూ వరుస పోస్టర్‌లతో హల్ చల్ చేశాడు.
undefined
పవర్ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేయటంతో నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు. అందాల వల వేస్తూ నెక్ట్స్ మూవీ థ్రిల్లర్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. తనకు ఎంతో నచ్చిన అమ్మాయి తొడలను చూపిస్తూ థ్రిల్లర్ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ, త్వరలో రిలీజ్ అని ప్రకటించాడు.
undefined