చిరంజీవి సినిమాల్లో రాజమౌళికి నచ్చని సీన్..తిరిగి రాంచరణ్ పైనే అప్లై చేశాడు, దటీజ్ జక్కన్న

First Published | Aug 5, 2024, 2:30 PM IST

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. 

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు. తాను ఎలాంటి సన్నివేశం తెరకెక్కించిన అది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటానని రాజమౌళి చాలా సందర్భాల్లో తెలిపారు. 

ఎంత పెద్ద చిత్రం అయినా, ఎంతటి అద్భుత సన్నివేశం అయినా తనకి ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలని.. లేకుంటే ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ ఉంటుందని రాజమౌళి అన్నారు. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్స్ ని. ఆయన సినిమాలు చూస్తుంటాను. 


Kalki 2898 AD

ఒకసారి కొదమ సింహం సినిమా చూస్తున్నా. చిరంజీవిని ఆ చిత్రంలో పీకల వరకు భూమిలో పూడ్చేస్తారు. ఆయన గుర్రం రక్షిస్తుంది. చిరంజీవి నోటికి తాడు అందించి బయటకి లాగుతుంది. ఆ సీన్ ని విపరీతంగా ఎంజాయ్ చేశా. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. 

ఆ సీన్ పూర్తిగా నచ్చడం లేదు. ఏం మిస్ అయింది అని గమనిస్తే.. మనిషి అయినా, జంతువు అయినా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే కృతజ్ఞత, ప్రేమ చూపించాలి. కానీ ఆ సీన్ లో గుర్రానికి కృతజ్ఞత చెప్పడం కానీ, ప్రేమగా దగ్గరకి తీసుకోవడం కానీ లేదు. 

అది తనకి చాలా బాధగా అనిపించింది అని రాజమౌళి అన్నారు. మగధీరతో నేను ఆ మిస్టేక్ చేయలేదు. మగధీరతో కూడా అలాంటి సన్నివేశమే ఉంటుంది. చరణ్ ఇసుకలో కూరుకుపోతున్న సమయంలో గుర్రం సహాయంతో బయటపడతాడు. వెంటనే వచ్చి గుర్రానికి కృతజ్ఞత తెలియజేస్తాడు అని రాజమౌళి అన్నారు. 

అలా చేయకుంటే ఆ సీన్ కంప్లీట్ అయినట్లు అనిపించదు అని జక్కన్న తెలిపారు. ప్రతి సీన్ గురించి రాజమౌళి ఇంత లోతుగా ఆలోచిస్తారు కాబట్టే ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకుంటున్నారు. 

Latest Videos

click me!