మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా, ఈ సినిమా విజయంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రశంసల వర్షం కురిపించారు. విష్ణు నటనను కొనియాడుతూ వర్మ పంపిన వాట్సాప్ సందేశాన్ని మంచు విష్ణు తన X (అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఎమోషనల్ కూడా అయ్యారు మంచు విష్ణు., ఈ మెసేజ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
మంచు విష్ణుని ఏడిపించిన ఆర్జీవి
వర్మ నుంచి వచ్చిన ప్రశంసలపై విష్ణు స్పందిస్తూ, “రాము గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకుంటున్నాను. ఎందుకంటే నేను దీన్ని సాధించగలనని నమ్మాను. ఇది నా జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయం. నేను ఎక్కడికి వెళ్లినా, ఈ సినిమాపై అనుమానం, ద్వేషాన్నే చూశాను, కాని అంతకు మించి ప్రేమ నాకు ఇక్కడ దొరికింది అని పేర్కొన్నారు.