ramgopal varma, Ram Charan, Game Changer
రామ్ గోపాల్ వర్మ మళ్లీ డ్యూటీ ఎక్కేసారు. ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్స్ పై సెటైర్స్ వేసారు. రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లపై నెట్టింట పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. వంద కోట్లు ఎగస్ట్రా వేసారని సోషల్ మీడియా జనం విమర్శలు చేసారు. ఈ నేపధ్యంలో వర్మ కూడా కామెంట్స్ చేసారు.
game changer
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్ “చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసినట్టుగా ప్రకటించి విమర్శల పాలవుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార పోస్టర్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయలను అధిగమించాయని విడుదల చేసారు , ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చర్చ నడుస్తుంది .
shankar
100crFakeForGameChanger మరియు #GameChangerPosterScam వంటి హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో ఈ వ్యత్యాసం గురించి ట్రెండ్ అవుతుంది . సినిమా మార్కెటింగ్ బృందం విడుదల చేసిన గణాంకాల ప్రామాణికతను చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు . తాజాగా 'గేమ్ ఛేంజర్' వసూళ్లపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఈ మూవీ మొదటి రోజు వసూళ్లపై ఆయన సెటైరికల్ ట్వీట్ చేశారు.
game changer
"ఒకవేళ 'గేమ్ ఛేంజర్' తొలి రోజు వసూళ్లు రూ. 186 కోట్లు అయితే, 'పుష్ప 2' కలెక్షన్స్ రూ. 1,860 కోట్లు ఉండాలి. 'గేమ్ ఛేంజర్'కు రూ. 450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు రూ. 4,500 కోట్లు ఖర్చయి ఉండాలి. 'గేమ్ ఛేంజర్' విషయంలో అబద్ధాలు నమ్మదగినవిగా ఉండాలి. అయితే, వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నా" అంటూ ఆర్‌జీవీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
జనవరి 10,2025న విడుదలైన గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, జయరామ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Ram Charans Game Changer
కలెక్షన్స్ వివాదం బయటపడటంతో, అభిమానులు మరియు పరిశ్రమ నిపుణులు బాక్సాఫీస్ రిపోర్టింగ్ లో మరింత పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం లో ప్రభుత్వం సినిమాకు ఇచ్చిన వెసులుబాటును కూడా , కోర్టు సూచనల వాళ్ళ వెనక్కు తీసుకోవడం తో సినిమా పైన ఆర్ధిక పరం గా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .