స్టార్ హీరోకి షాకిచ్చిన సాయి పల్లవి, ఇలా ఎందుకు చేసిందో తెలుసా ?

First Published | Jan 14, 2025, 11:05 AM IST

టాప్ హీరోతో నటించే అవకాశాన్ని సాయిపల్లవి వదులుకున్నట్టు సమాచారం.

Sai Pallavi Declines Film Opposite Vikram dtr
సాయిపల్లవి సినిమాలు

గ్లామర్ లేకుండానే స్టార్ హీరోయిన్ కావచ్చు అని నిరూపించింది సాయిపల్లవి. ఆమె డ్యాన్స్ కి కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రేమమ్ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు తెలుగు, తమిళంలోనూ స్టార్ హీరోయిన్. ఆమీర్ ఖాన్ కొడుకు సరసన బాలీవుడ్ లోనూ నటిస్తోంది.

శివకార్తికేయన్ తో సాయిపల్లవి

సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ సినిమా సూపర్ హిట్. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రాహుల్ బోస్, భువన్ అరోరా తదితరులు నటించారు. చెన్నైకి చెందిన మాజీ సైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.335 కోట్లు వసూలు చేసింది.


అమరన్ సినిమా

ఈ సినిమాలో ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయిపల్లవి నటించింది. ఆమె నటన చాలా సహజంగా ఉందని, ఈ సినిమాకి సాయిపల్లవికి జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కెరీర్ లో మంచి సినిమాలనే ఎంచుకుంటున్న సాయిపల్లవి ఓ స్టార్ హీరో సినిమాలో నటించడానికి నిరాకరించినట్టు సమాచారం.

మడోన్ అశ్విన్ సినిమా

యోగిబాబుతో మండేల సినిమా తీసి పేరు తెచ్చుకున్న దర్శకుడు మడోన్ అశ్విన్. శివకార్తికేయన్ తో మావీరన్ తీసిన ఆయన.. ఇప్పుడు విక్రమ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ నటిస్తున్న 'వీర దీర సూరన్ పార్ట్ 2' విడుదలైన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సాయిపల్లవిని సంప్రదించగా.. ఆమె ఆ ఆఫర్ ని తిరస్కరించినట్టు తెలిసింది. సీనియర్ హీరోతో నటించడానికి సాయిపల్లవి ఇష్టపడటం లేదని కొందరు అంటుండగా.. కొన్ని సినిమాలనే ఎంచుకుని నటిస్తున్న సాయిపల్లవి డేట్స్ సమస్య వల్లే ఈ సినిమాలో నటించడం లేదని మరికొందరు అంటున్నారు. నాగ చైతన్యతో సాయిపల్లవి నటించిన 'తండేల్ ' సినిమా త్వరలో విడుదల కానుంది.

Latest Videos

click me!