ట్రయాలజీగా ఆర్జీవీ బయోపిక్‌: ఫస్ట్‌ లుక్‌ వదిలిన వర్మ

First Published | Aug 26, 2020, 7:11 PM IST

రామ్‌ గోపాల్‌ వర్మ బయోపిక్‌ను రాము పేరుతో మూడు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. మంగళవారం టైటిల్‌ లోగో రిలీజ్ చేసిన వర్మ, తాజాగా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను వదిలాడు.

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో బాంబు పేల్చాడు. ఇటీవల వరుసగా బయోగ్రాఫికల్‌ సినిమాలు మాత్రమే తీస్తున్న ఆర్జీవీ, తాజాగా తన బయోపిక్‌ను ఎనౌన్స్‌ చేశాడు. ఈ బయోపిక్‌ను రాము పేరుతో మూడు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. మంగళవారం టైటిల్‌ లోగో రిలీజ్ చేసిన వర్మ, తాజాగా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను వదిలాడు.
ఈ సినిమాలో ఒక్కో పార్ట్‌లో తన జీవితంలో ఒక్కో పీరియడ్‌ను చూపించనున్నట్టుగా చెప్పాడు వర్మ. తొలి రెండు భాగాల్లో యంగ్‌ వర్మగా మరో నటుడు నటిస్తుండగా, చివరి భాగంలో తన పాత్రో తానే నటిస్తున్నట్టుగా ప్రకటించాడు. మూడు సినిమాలకు సంబంధించి మూడు డిఫరెంట్‌ ట్వీట్‌లతో వివరించాడు వర్మ.

తాజా ఈ సినిమాకు సంబంధించి మోషనల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. రాము మెంటాలిటి తెలిసేలా.. ఇంటిలిజెంట్‌, బోల్డ్, వియర్డ్, డెవిల్‌, జీనియస్‌, ఎసెంట్రిక్‌, ఇడియట్‌, సోషల్ రాడికల్‌, ఫిలాసఫర్, ఇమ్మోరల్‌, గస్టీ, డ్రంకర్డ్‌ అనే పదాలను వాడాడు. దీంతో వర్మ తన సినిమాను గత చిత్రాల స్టైల్‌లోనే సెటైరికల్‌గా చూపించబోతున్నాడని అర్ధమవుతోంది.

Latest Videos

click me!