పొలిటికల్ ‘‘వ్యూహం’’.. రీల్ వర్సెస్ రియల్.. పాత్రల డిజైన్‌లో ఆర్జీవీ మార్క్..!!

Published : Aug 15, 2023, 01:27 PM ISTUpdated : Aug 15, 2023, 01:29 PM IST

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఈ చిత్రంలోని పాత్రలను చూస్తే.. అది ఎవరనేది చూసేవారికి ఇట్టే అర్థమయ్యేలా ఆర్జీవీ డిజైన్ చేశారు. ఈ పాత్రలను ఆర్జీవీ తన కోణంలో చూపించనున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే రీల్ వర్సెస్ రియల్‌ పాత్రలను ఒకసారి గమనిస్తే.. 

PREV
18
పొలిటికల్ ‘‘వ్యూహం’’.. రీల్ వర్సెస్ రియల్.. పాత్రల డిజైన్‌లో  ఆర్జీవీ మార్క్..!!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘‘వ్యూహం’’. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కూడా విడుదల అయింది. తాజాగా వ్యూహం సినిమా టీజర్-2ను ఆర్జీవీ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, వైఎస్ జగన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

28

అయితే చిత్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న పరిణామాలను ఆర్జీవీ తన కోణంలో చూపిస్తున్న సంగతి తెలిసిందే. 
 

38

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ పోలిన పాత్రలను విలన్స్ మాదిరిగా చూపించడం, వారు జగన్‌కు వ్యతికరేకంగా కుట్రలు చేస్తున్నట్టుగా చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. అయితే తాను అనుకున్నది తెరపై ప్రతిబింబించేలా.. ఆర్జీవీ ఆ పాత్రలను తీర్చిదిద్దారు. ఆ పాత్రలను తెరపై చూపించిన  విధానం చూస్తే.. అది ఎవరనేది ప్రేక్షకులకు ఇట్టే అర్థమయ్యేలా డిజైన్ చేశారు. 
 

48

ఈ చిత్రంలో ప్రతి పాత్రలను రియల్ లైఫ్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలకు ముడిపెడుతూ.. తనకు దోచినట్టుగా ఆ పాత్రలను మలుచుకున్నారు. తద్వారా తాను చెప్పాలనుకున్నదానిని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.  

58

ఇంకా ఈ చిత్రంలో.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌, చంద్రబాబులతో పాటు జగన్‌ను వ్యతిరేకించే వారిలో ఎవరినీ వదలకుండా టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. చిరంజీవిని పోలిన పాత్రకు కూడా వెయిటేజ్‌ ఇచ్చినట్టుగా అర్థం అవుతుంది. 
 

68

‘‘నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఓ రౌండ్ వేసి వస్తుంది’’ జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పడం టీజర్‌లో కనిపించింది. అలాగే చివరలో.. ఎప్పుడో ఒకసారి మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అనే డైలాగ్ వినిపించింది. 

78

ఇందుకు చంద్రబాబు పోలిన పాత్రలోని వ్యక్తి..‘‘వాడికి అంతా సీన్ లేదు.. తానను తానే పొడుచుకుంటాడు’’ అని చెప్పడం చూడొచ్చు. ఇక,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 

88

అయితే ఇప్పటికే ఈ చిత్రంపై టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ 2 మాత్రం రాజకీయ ప్రకంపనాలు సృష్టించే అవకాశం లేకపోలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories