రాంచరణ్ బిగ్ స్టెప్.. టీవీ ఛానల్ కొనబోతున్న మెగా పవర్ స్టార్.. బాబాయ్ కోసమే?

pratap reddy   | Asianet News
Published : Sep 10, 2021, 01:02 PM ISTUpdated : Sep 10, 2021, 01:15 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటుడు మాత్రమే కాదు.. ఎంట్రప్రెన్యూర్ కూడా. గతంలో రాంచరణ్ ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

PREV
16
రాంచరణ్ బిగ్ స్టెప్.. టీవీ ఛానల్ కొనబోతున్న మెగా పవర్ స్టార్.. బాబాయ్ కోసమే?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటుడు మాత్రమే కాదు.. ఎంట్రప్రెన్యూర్ కూడా. గతంలో రాంచరణ్ ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి, శంకర్ లాంటి దిగ్గజ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. 

 

26

ఇంత బిజీలో కూడా చరణ్ వ్యాపారవేత్తగా కూడా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో చాలా మంది బడా హీరోలు ఏదో ఒక బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తాజాగా రాంచరణ్ గురించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. రాంచరణ్ బిగ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ త్వరలో ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ని కొనబోతున్నట్లు తెలుస్తోంది. 

 

36

ఇప్పటికే ప్రస్తుతం ఆ ఛానల్ ఓనర్ తో డీల్ కుదిరిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఛానల్ అంత పాపులర్ కాదు. సరైన టీమ్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఛానల్ అభివృద్ధిలోకి రావడం లేదు. ఇప్పటికే ఆ ఛానల్ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నాయకుల చేతులు మారింది. అలాంటి ఛానల్ ని టేకప్ చేసి డెవలప్ చేయాలని రాంచరణ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 

 

46

ప్రస్తుతం ఆ ఛానల్ నష్టాల్లో నడుస్తున్నప్పటికీ రాంచరణ్ అద్భుతమైన అమౌంట్ ని ఆఫర్ చేసినట్లు టాక్. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ న్యూస్ ఛానల్ తో పాటు చరణ్ మరో రెండు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

 

56

ఇంత సడెన్ గా రాంచరణ్ టీవీ ఛానల్ ని దక్కించుకోవడం వెనుక బలమైన కారణం వినిపిస్తోంది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసమే రాంచరణ్ ఈ ఛానల్ కొంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చేందుకు రాంచరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. 

 

66

రాంచరణ్, పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమానురాగాలతో ఉంటారో అందరికీ తెలిసిందే. మిగిలిన పార్టీలతో పోల్చితే జనసేన పార్టీకి మీడియా బలం తక్కువ అని రాంచరణ్ భావిస్తున్నాడు. అందుకే బాబాయ్ కి హెల్ప్ చేసేందుకు టివి రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.  

click me!

Recommended Stories