మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అపోలో ఆసుపత్రికి హెడ్‌గా ఉన్నారు. అయితే ఆమె మొదట ఈ రంగంలోకి రావాలనుకోలేదు. కానీ ఓ తల్లి బాధని ప్రత్యక్షంగా చూసిన ఆమె మనసు మార్చుకున్నారు.
ఉపాసన.. మెగా కోడలిగా, రామ్ చరణ్‌కి భార్యగా, అపోలో ఫార్మసీ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆమె రెండోసారి తల్లి అయ్యారు. మొదట కూతురు క్లీంకారకి జన్మనివ్వగా, ఇటీవల కవలలకు జన్మనిచ్చారు. కొడుకు, కూతురు జన్మించారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్నారు ఉపాసన. తమ ఫ్యామిలీలోకి వారసుడు రావడంతో చిరంజీవి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఓ వైపు తల్లిగా, భార్యగా, కోడలిగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు ఉపాసన. ఫ్యామిలీ లైఫ్‌ని, కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.
25
ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్లాలనుకున్న ఉపాసన
ఉపాసన అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను తన వారసత్వంగా పొందింది. తన తాత ప్రతాప్ సీ రెడ్డి దీన్ని స్థాపించారు. దాన్ని తమ వారసులు కొనసాగిస్తున్నారు. అయితే ప్రారంభంలో ఈ రంగంలోకి రావడం ఉపాసనకి ఇష్టం లేదట. తాను ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్లాలనుకున్నారట. కానీ తాతయ్యకి ఈ విషయం చెబితే ఆయన ` ఈ రంగంలో తక్కువ మందికే సేవ చేయగలవు, ఎక్కువ మందికి సేవ చేసే రంగం గురించి ఆలోచించు` అని చెప్పారట. `ఓ రోజు అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఓ పేద మహిళ, భవన నిర్మాణ కార్మికురాలు.. తన కొడుకు ప్రాణాలను బతకించమని ప్రాదేయపడుతుంది. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఏంటని అడిగితే ఆమె తన బాధ చెప్పుకుంది. డాక్టర్లని అడితే చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడని, చాలా ఖర్చుఅవుతుందని చెప్పారు.
35
ఉపాసన ఆలోచనని మార్చిన ఘటన
ఆ ఖర్చు నేను భరిస్తాను. వెంటనే ట్రీట్‌మెంట్ చేయమని చెప్పాను. ట్రీట్‌మెంట్ చేసినా ఆ పిల్లాడిని బతికించలేకపోయాం. దీంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరయ్యింది. ఆమె బాధ వర్ణణాతీతం. ఎందుకంటే అప్పటికే పుట్టిన ముగ్గురూ ఏదో ఒకసమస్యతో చనిపోయారు. నాలుగో సంతానం కూడా అలానే కావడంతో ఆమె దుఃఖానికి అవదుల్లేవు. ఆ ఘటనతో చలించిపోయాను. ఆమెకి నావంతు సహాయం అందించాను. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈ సారి ఏ సమస్య లేదు. పాపాయి బతికింది. ఆ సమయంలో ఆ తల్లి ఆనందాన్ని చూసి నాకు ఎంతో సంతోషమేసింది. సేవ చేయడంలో ఉన్న కిక్కు ఏంటో అప్పుడు తెలిసింది.
ఈ ఘటనతో నా మనసు మారిపోయింది. తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఆసక్తిని పక్కన పెట్టి అపోలో ఆసుపత్రులను డెవలప్ చేయడానికి, దీన్ని విస్తరించడానికి నా వంతుకృషి చేస్తున్నాను. అనేక కార్యక్రమాలను విస్తరించాను. చిన్నారలకు ఎదురయ్యే గుండె సమస్యల్ని తగ్గించేందుకు `సేవ్ ఏచైల్డ్ హార్ట్` పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాం. క్యాన్సర్‌తో బాధడే పేదలకు `క్యూర్` పేరుతో ఉచిత సేవలందిస్తున్నాం` అని తెలిపారు ఉపాసన. చరణ్‌తో పెళ్లైన ఏడాది తర్వాత వసుంధరకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
55
`పెద్ది` సినిమాతో ఆరబోతున్న రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం జరిగింది. రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నారు. గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.