ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌లో ఉన్నవి, తనలో లేనివి చెప్పిన రామ్‌చరణ్‌.. ఆయన ఇష్టపడేవి ఏంటంటే?

Published : Jul 14, 2023, 05:17 PM ISTUpdated : Jul 14, 2023, 06:57 PM IST

ఎన్టీఆర్‌, చరణ్‌, మహేష్‌ బాబు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక బన్నీ తన ఫ్యామిలీలో ఒకరు. ఇలా ఈ ముగ్గురితోనూ చరణ్‌కి మంచి అనుబంధమే ఉంది. అయితే తనలో లేనివి, వారిలో ఉన్నవాటి గురించి చరణ్‌ ఆసక్తికర కామెంట్‌ చేశారు.   

PREV
16
ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌లో ఉన్నవి, తనలో లేనివి చెప్పిన రామ్‌చరణ్‌.. ఆయన ఇష్టపడేవి ఏంటంటే?

రామ్‌చరణ్‌.. ఇప్పుడు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఆయనకు ఇటీవల కూతురు పుట్టిన విషయం తెలిసిందే. భార్య  ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. పాపకి `క్లింకార కొణిదెల` అనే నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం చరణ్‌.. తన కూతురుని మధుర క్షణాలను అనుభవిస్తున్నారు. మరోవైపు హీరోగా ఆయన గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో చరణ్‌ అంతర్జాతీయంగా సత్తా చాటారు. సినిమా కంటే ఆయన వ్యక్తిగతంగా వచ్చిన క్రేజ్‌ వేరే లెవల్‌. 
 

26

ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోలుగా ఇమేజ్‌ పరంగా చరణ్‌, ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆ పోటీ ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరిని మించిన సినిమాలు మరొకరు చేస్తున్నారు. భారీ చిత్రాలతో వచ్చే ఏడాది అలరించేందుకు రాబోతున్నారు. అయితే తాజాగా చరణ్‌కి సంబంధించిన ఓ రేర్‌ వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో చరణ్‌.. ఈ ముగ్గురి హీరోల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌లో ఉన్నవి, తనకు ఉంటే బాగుండేదనిపించేవి ఏవి అని యాంకర్‌గా ఉన్న జయప్రద అడిగిన ప్రశ్నలకు చరణ్‌ సమాధానం చెప్పారు. క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. 
 

36

దీనికి రామ్‌చరణ్‌ చెబుతూ, `ఎన్టీఆర్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. అతనిలో ఉన్న ఎనర్జీ తనకు ఉంటే బాగుండేదనిపిస్తుందన్నారు. బన్నీలో స్పోర్టివ్ నెస్‌ ఉంటుందని, ఎవరేమన్నా హార్ట్ కి తీసుకోడని, సరదాగా తీసుకుని ముందుకెళ్తాడని చెప్పాడు చరణ్‌. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఆయనలోని అందం అని, ఆయన అందం తనకు కొంచెమైనా ఇస్తే బాగుండేదన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. 
 

46

దీంతోపాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చరణ్‌. ఇష్టమైన హాలీడే స్పాట్‌..బెంగుళూరులోని తమ ఫామ్‌హౌజ్‌ అని, ఇష్టమైన కలర్‌ గ్రీన్‌ అని, నచ్చిన ఫుడ్‌ ఇండియన్‌ వెజ్‌, అలాగే ఇష్టమైన ఆట క్రికెట్‌ అని చెప్పారు రామ్‌చరణ్‌. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.
 

56

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. హీరోగా బిజీగా ఉన్నాడు. ఆయన శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కియారా అద్వానీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మించే ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతుంది. దీంతోపాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు చరణ్‌. 

66

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించిన విషయం తెలిసిందే. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా గతేడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది. రూ 12వందల కోట్లు వసలు చేసింది. `నాటు నాటు` పాటకి గానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఏకంగా ఆస్కార్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories