RC16: 'అద్దె ఆటగాడు' గా రామ్ చరణ్? మెగా ఫ్యాన్స్ కు కూడా షాక్!

Published : Mar 16, 2025, 03:50 PM IST

రామ్ చరణ్ RC16లో అద్దె ఆటగాడిగా కనిపించనున్నాడని సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న క్రీడల్లో ప్రతిభ కనబరుస్తాడని తెలుస్తోంది.

PREV
14
RC16:  'అద్దె ఆటగాడు' గా రామ్ చరణ్? మెగా ఫ్యాన్స్ కు కూడా షాక్!
Ram Charan to show his prowess as hired sportsman? in telugu


కొత్తతరహా పాత్రలు లేకపోతే సినిమాలు చూసేవారిలో కిక్ ఉండటం లేదు. సినిమాలో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ లేకపోతే రామ్ చరణ్ ఒప్పుకునేలా లేడు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘RC16’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, రామ్ చరణ్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ చేసే పాత్రలాంటిది ఇప్పటిదాకా ఎవరూ చెయ్యనది అని చెప్తున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఏమిటి

24
Ram Charan to show his prowess as hired sportsman? in telugu


స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్ పాత్ర

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక టాలెంట్ ఉన్న  అథ్లెట్‌గా కనిపించనున్నారని సమాచారం. బుచ్చిబాబు కథనంలో ఒక గ్రామీణ ప్రాంత యువకుడు, అతని కృషి, పట్టుదలతో రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడం, ఆపై జాతీయ స్థాయికి ఎదగడమనే ప్లాట్ వినిపిస్తోంది.

అయితే ఏ ఆట అంటే ఏ ఆటైనా అడగలుగుతాడట.  క్రికెట్‌, క‌బ‌డ్డీ, కుస్తీ.. ఇలా దాదాపు అర‌డ‌జ‌ను ఆట‌లు ఆడేవాడుగా రామ్ చరణ్  ఈ సినిమాలో క‌నిపిస్తాయ‌ట‌. అదేంటి అంటే ఎవరికి అవసరం వచ్చినా  హీరో అద్దెకు వెళ్లే ఆటగాడుగా కనించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. 
 

34
Ram Charan to show his prowess as hired sportsman? in telugu


అద్దె ఆటగాడు 

మీడియా వర్గాల నుంచి అందుతన్న సమాచారం మేరకు  ఐపీఎల్ లో ఆట‌గాళ్ల‌ని ఎలా కొనుక్కొంటున్నారో, అలా… కొంత‌మందిని కొనుక్కొని, ఓ జ‌ట్టుగా త‌యారు చేసి, ఆట‌లు ఆడిస్తారు. ఆడినందుకు రోజుకు ఇంత అని డ‌బ్బులు ఇస్తారు.

అదీ అద్దె ఆటగాడు అంటే. ఇలాంటి ఆట‌గాడిగా చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడ‌ని వినిపిస్తోంది. ఇప్పటికే క్రికెట్ నేప‌థ్యంలో సాగే కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. రామ్ చరణ్ పాత్ర ఈ కథలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ పాత్ర కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం.

44
Ram Charan to show his prowess as hired sportsman? in telugu


బుచ్చిబాబు అప్రోచ్ – ఎమోషన్ & రియాలిటీ

బుచ్చిబాబు దర్శకత్వం ఎప్పుడూ నిజమైన భావోద్వేగాలతో నిండివుంటుంది. ‘ఉప్పెన’లో ప్రేమ, తల్లిదండ్రుల అనుబంధం, సామాజిక సమస్యలను హృదయాన్ని హత్తుకునేలా చూపిన ఆయన, ‘RC16’లో స్పోర్ట్స్ డ్రామాకు అదే లెవెల్‌లో భావోద్వేగాన్ని మేళవించనున్నారు.

కేవలం గేమ్-బేస్డ్ కంటెంట్ కాకుండా, ఒక అథ్లెట్ ఎదుగుదల వెనుక ఉండే స్ట్రగుల్స్, గ్రామీణ కష్టాలను ఫోకస్ చేయనున్నట్లు టాక్. 

ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న చిత్రానికి సంగీతం చాలా కీలకం. థ్రిల్లింగ్ BGM, మోటివేషనల్ సాంగ్స్ ద్వారా రెహమాన్ మ్యాజిక్ తెరపై కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, విజువల్స్ విషయంలో అద్భుతమైన సినిమాటోగ్రఫీని వాడతారని టాక్.
 

Read more Photos on
click me!

Recommended Stories