Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే

Published : Sep 21, 2026, 04:07 PM IST

విలేజ్ లో ముసుగు విలన్లు ఉండే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. పైకి మంచిగా నటిస్తూ సమయం వచ్చినప్పుడు నిజస్వరూపం బయటపెట్టే విలన్లు ఉన్న సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
16
Village Backdrop Movies

ఇటీవల విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో చాలా సినిమాల్లో విలన్ ఎవరనేది ముందే తెలిసిపోయేది. కానీ ఇప్పుడు వస్తున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు విలన్ ఎవరనే విషయం ముందే చెప్పడం లేదు. ఇంటర్వెల్ లేదా ప్రీ క్లైమాక్స్ లో విలన్ ని రివీల్ చేస్తున్నారు. అప్పటి వరకు అతడు మంచి వాడిలా ముసుగు వేసుకుని నటిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అతడి నిజస్వరూరం బయట పడడం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేరుగా కనిపించే విలన్ ని ఎదుర్కోవడం స్టార్ హీరోలకు సులభమే. కానీ ముసుగు వేసుకున్న వారిని ఎదుర్కొనడం స్టార్లకు పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఆ తరహాలో వచ్చిన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కురిపిస్తున్నాయి. ఈ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

26
రంగస్థలం

మంచి వాడిలా ముసుగు వేసుకున్న విలన్ ఉండే సినిమాల్లో రంగస్థలం ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ విలన్ అనే సంగతి ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు ఎవరూ గెస్ కూడా చేయలేరు. అప్పటి వరకు మంచి ఎమ్మెల్యేగా ప్రకాష్ రాజ్ నటిస్తూ ఉంటారు. రాంచరణ్, ప్రకాష్ రాజ్ మధ్య క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం సినిమాకే హైలైట్. ఈ మూవీ 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.

36
లెనిన్

అఖిల్ కి తొలి సూపర్ హిట్ అందించిన లెనిన్ మూవీలో కూడా విలన్ మంచి వాడిలా నటిస్తూ సమయం వచ్చినప్పుడు తన నిజస్వరూపం బయటపెడతాడు. ఈ మూవీలో ప్రమోద్ పంజు విలన్ గా నటించారు. ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.

46
ఇరుముడి

రవితేజ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ఇరుముడి. ఈ మూవీలో ఆ ఊరి ఎమ్మెల్యే నే విలన్. ప్రీ క్లైమాక్స్ వరకు ఎమ్మెల్యే మంచి వాడిలా నటిస్తూ ఉంటాడు. ట్విస్ట్ రివీల్ అయ్యాక అతడు చేసే దారుణాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ మూవీ 250 కోట్ల వరకు గ్రాస్ సాధించింది.

56

కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ విలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన పునర్జన్మల కథ. ఆ ఊరిలో అందరికీ సాయం చేసే వ్యక్తి ఒకరుంటారు. అతడు చెడ్డ వాడు అనే విషయంలో క్లైమాక్స్ లో బయట పడుతుంది.

66
విరూపాక్ష

సాయి దుర్గ తేజ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీలో హీరోయినే విలన్. ఆ ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది.

Read more Photos on
click me!

Recommended Stories