Sobhan Babu: దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ నటుడు, నటభూషణ్ శోభన్ బాబు గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఒక సినిమా విషయంలో కృష్ణ రెడ్డిని శోభన్ బాబు నిలదీసిన విషయాన్ని వివరించాడు.
టాలీవుడ్ లో అందరు డైరెక్టర్లు ఒక ఎత్తైయితే.. ఎస్వీ కృష్ణారెడ్డి మరో ఎత్తు. స్టార్ హీరోలతో మాత్రమే కాదు.. కమెడియన్స్ ను కూడా హీరోలుగా పెట్టి సినిమా చేసిన ఘనత కృష్ణారెడ్డిది. మహిళా ప్రేక్షకుల మనసు గెలుచుకునేలా సినిమాలు చేసిన ఈ దర్శకుడు.. మాస్ ప్రేక్షకులను కూడా అలరించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరపైకి తీసుకురావడంలో కృష్ణారెడ్డి మార్క్ ప్రత్యేకంగా ఉండేది. అటువంటి సినిమాల్లో శుభలక్నం కూడా ఒకటి. ఈ సినిమాలో ఆయన చేసిన ప్రయోగం.. డబ్బు మీద మోజుతో భర్తను భార్య ఎలా అమ్మకుంది. ఆతరువాత ఏం జరిగింది అనేది కథ. ఈసినిమా చూసి నటభూషణుడు శోబన్ బాబు ఏమన్నాడో తెలుసా?
24
శుభలగ్నం' సినిమా గురించి ఏమన్నాడంటే?
ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా 'శుభలగ్నం' ఈ సినిమా చూసిన తర్వాత శోభన్ బాబు స్వయంగా ఆయనను కలవడానికి పిలిపించారని కృష్ణారెడ్డి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా చూసిన శోభన్ బాబు వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. ఒక హోటల్‌లో దిగి, కృష్ణారెడ్డికి కబురు పెట్టగా, ఆయన వెంటనే పరిగెత్తుకెళ్లారు.
కృష్ణారెడ్డిని చూడగానే .. శోభన్ బాబు “ఏమయ్యా శుభలగ్నం ఎట్లా తీసావయ్యా!” అని ఆశ్చర్యంగా అడిగారు. దానికి కృష్ణారెడ్డి “మీరు చేసేలాంటి ఫ్యామిలీ సినిమాలే చేశానండీ” అని సమాధానమిచ్చారు. అయితే శోభన్ బాబు స్పందిస్తూ, “లేదు.. నేను చేసే సినిమాలు కాదు, ఇందులో ఏదో కొత్తదనం పెట్టావు. లేకపోతే అంత రేంజ్‌లో ఎందుకు ఆడుతుంది? నా సినిమాల్లో కూడా ఇలాంటి పాయింట్ రాలేదు” అని ప్రశంసించారు.
34
ఈ కథ నాతో ఎందుకు చేయలేదు?”:
"భర్తను అమ్మేసుకోవడం" అనే వినూత్నమైన కాన్సెప్ట్ గురించి శోభన్ బాబు గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఇలాంటి కొత్త కథ నా దగ్గరకు ఎందుకు తీసుకురాలేదు? నాతో ఎందుకు చేయలేదు?" అని శోభన్ బాబు జాలిగా, సరదాగా అడిగారని కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు . దానికి ఆయన “మీతో చేయకూడదని కాదు సార్, కొత్త వాళ్లతో ప్రయత్నిద్దామని జగపతి బాబుతో చేశాను” అని బదులిచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేక్ తింటూ కాసేపు ముచ్చటించారు . వెళ్లేటప్పుడు “భవిష్యత్తులో నాకోసం ఏమైనా మంచి కథ ఉంటే గుర్తుపెట్టుకుని కబురు చెయ్యి” అని శోభన్ బాబు గారు కోరారు .
కొత్త కథను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు - కారణం ఏంటి?
శోభన్ బాబు ఆమాట అనడంతో.. కొన్నాళ్ల తరువాత ఎస్.వి. కృష్ణారెడ్డి గారు ఒక సినిమా కోసం ప్రత్యేకంగా చెన్నై వెళ్లి శోభన్ బాబుని కలిశారు. అందులో ఆయనను శ్రీకృష్ణుడి పాత్రలో నటించమని అడిగారు. అయితే, శోభన్ బాబు గారు చాలా హుందాగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. "నేను ఇప్పుడు అలాంటి పాత్రలు చేయడం లేదు. నా వయసు కూడా దాటిపోయింది, అందుకే ఇకపై ఎలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని స్పష్టం చేశారు. శోభన్ బాబు క్రమశిక్షణకు, తన నిర్ణయాలకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వానికి ఈ సంఘటన నిదర్శనమని ఎస్.వి. కృష్ణారెడ్డి ఈ ఇంటర్వ్యూ ద్వారా వివరించారు