రామ్ చరణ్ ఇప్పటికే ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ చిత్రం చేశారు. వీరిద్దరు కలిసి `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అది 1200కోట్లు వసూలు చేసింది.
సినిమాకి ముందు చరణ్, తారక్ మంచి స్నేహితులు. ఆ స్నేహం ఈ సినిమాకి ఉపయోగపడింది. అయితే ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరిది తక్కువ అనే చర్చ ప్రధానంగా నడిచింది. చరణ్ హీరో, తారక్ కీలక రోల్ అన్నారు. కానీ నటనలో ఎవరికీ వాళ్లు ది బెస్ట్ ఇచ్చారు. మెప్పించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్‌తో రామ్ చరణ్ మల్టీస్టారర్ కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. అట్లీ ఈ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత వరకు మెటీరియలైజ్ అవుతుంది.
ఎంత వరకు పట్టాలెక్కుతుందనేది ఆసక్తికంగా మారింది. ఈ క్రమంలో మరో మల్టీస్టారర్ వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. రామ్ చరణ్ మనసులో మాట బయటపెట్టారు. తాను ఏ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడో వెల్లడించారు.
read more: ఫ్యాన్స్ కి ప్రభాస్ న్యూ ఇయర్ సందేశం, మనల్ని ప్రేమించే మనుషులున్నారంటూ ఎమోషనల్ వర్డ్స్
Ram Charan
రామ్ చరణ్ త్వరలో `గేమ్ ఛేంజర్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చరణ్. ఈ క్రమంలో ఆయన బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్ స్టాపబుల్` 4లో పాల్గొన్నారు.
మంగళవారం ఈ షూట్ జరిగింది. అయితే బాలయ్యతో మాట్లాడుతూ చరణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారట. తాను కోరుకుంటున్న మల్టీస్టారర్ విషయాన్ని బయటపెట్టారట.
also read:`మార్కో` మూవీ తెలుగు రివ్యూ
రామ్ చరణ్‌కి.. మహేష్ బాబుతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందట. బాలయ్య షోలో మహేష్ టాపిక్ వచ్చినప్పుడు తన మనసులో మాట చెప్పాడట. ఇండస్ట్రీలో చరణ్, ఎన్టీఆర్‌తోపాటు మహేష్ కూడా మంచి ఫ్రెండ్స్. ఈ ముగ్గురు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఏ ఆకేషన్ వచ్చినా ఈ ముగ్గురు కలుసుకుంటారు. ఈ క్రమంలో వీరి మధ్య మంచి ర్యాపో ఉంది. స్నేహం ఉంది, చనువు ఉంది.
అందులో భాగంగానే మహేష్‌తో మల్టీస్టారర్ చేయాలని ఉందని చరణ్ చెప్పారట. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌తో సినిమా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మహేష్‌తో మూవీపై తన ఇంట్రెస్ట్ ని బయటపెట్టాడట. మరి ఇది వర్కౌట్ అవుతుందా అనేది పక్కన పెడితే ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. కొత్త ఏడాది సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేలా ఉంది. మరి నిజంగానే ఈ చర్చ జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. మొదటిసారి వీరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రారంభం కానుందట. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందించబోతున్నారు రాజమౌళి. దీనికోసం ప్రత్యేకంగా మేకోవర్ కూడా అవుతున్నారు మహేష్. ఈ మూవీతో మహేష్ రేంజ్ కూడా పెరిగిపోతుంది.
ఈ సంక్రాంతికి `గేమ ఛేంజర్`తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వం వహించి ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆర్‌సీ16`లో పాల్గొంటారు చరణ్. దీంతోపాటు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని క్రేజీ మూవీస్ లైనప్‌లో ఉన్నాయి.
read more: చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా తప్పుకోవడానికి కారణం ఏంటి? సీనియర్ నటుడు చెప్పిన పచ్చి నిజాలు