`ఆర్‌సీ16`టీమ్‌కి రామ్‌ చరణ్ కండీషన్‌‌.. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?

Published : Jan 29, 2025, 05:01 PM IST

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆర్‌సీ16` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ సెట్‌లో రామ్‌ చరణ్‌ స్ట్రిక్ట్ రూల్‌ పెట్టారట.   

PREV
15
`ఆర్‌సీ16`టీమ్‌కి రామ్‌ చరణ్ కండీషన్‌‌.. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?

రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్` సినిమా అనంతరం ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌.. `ఆర్సీ16` షూటింగ్ విషయంలో స్ట్రిక్ట్ రూల్‌ పెట్టాడు. రాజమౌళి చేసిందే ఇప్పుడు ఈ మూవీ విషయంలో ఫాలో అవుతున్నారట. అదేంటనేది చూస్తే. 
 

25

`గేమ్‌ ఛేంజర్‌` థియేట్రికల్‌గా డిజప్పాయింట్‌ చేసింది. సినిమాని కొందరు పనిగట్టుకుని చంపేశారు. దీనికితోడు లీక్‌ చేశారు. సోషల్ మీడియాలో హెచ్ డీ ప్రింట్‌ లీక్ అయ్యిందంటే ఎంతగా చరణ్‌ సినిమాని చంపేయాలని ప్లాన్‌ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాలే టార్గెట్‌గా కొందరు ఈ పని చేస్తున్నారని తెలుస్తుంది. రాబోయే సినిమాల విషయంలో కూడా ఇలాంటి లీక్‌లు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే చరణ్‌ ఓ కండీషన్‌ పెట్టారు. 

35
#RC16

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబు దరశకత్వంలో `ఆర్సీ16` మూవీలో నటిస్తున్నారు. నేడు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఇందులో రామ్‌ చరణ్‌ కూడా పాల్గొంటున్నారు. అయితే టీమ్‌కి మాత్రం చెర్రీ స్ట్రిక్ట్ రూల్ పెట్టాడు. షూటింగ్ సెట్‌లోకి ఎవరూ మొబైల్‌ ఫోన్‌ తీసుకురావద్దని చెప్పారట. చిన్న ప్రొడక్షన్‌ బాయ్‌ నుంచి, పెద్ద ఆర్టిస్ట్ ల వరకు అందరూ ఈ రూల్ ని ఫాలో అవ్వాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని సమాచారం. 

45

రాజమౌళి కూడా తన సినిమాల షూటింగ్‌లో ఎవరూ మొబైల్‌ ఫోన్‌ వాడటానికి లేదు. `బాహుబలి` టైమ్‌ నుంచే ఈ రూల్ ని పెట్టారు జక్కన్న. ఇప్పటికీ అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినిమాల కంటెంట్‌ లీక్ కావడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. చాలావరకు ఉండదు. అందుకే రామ్‌ చరణ్‌ ఈ రూల్‌ని `ఆర్‌సీ16` విషయంలో కూడా ఇంప్లిమెంట్‌ చేస్తున్నారని సమాచారం. మరి నిజం ఏంటనేది తెలియాలి.  

55

`ఆర్సీ16` పీరియాడికల్‌ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన కోచ్‌గా కనిపిస్తాడని, క్రికెట్, కబడ్డీ వంటి క్రీడల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌ డ్రాప్‌లో మూవీ సాగుతుంది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

read more" అకిరాతో పంజా 2, ఛాన్స్ వస్తే వదలను.. ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేల్చిన డైరెక్టర్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories