జెన్నిఫర్‌ లోపెజ్‌ పర్‌ఫెర్మెన్స్ తో ఊగిపోయిన నేత్ర మంతెన పెళ్లి వేడుక.. అందరి చూపు రామ్‌ చరణ్‌పైనే

Published : Nov 24, 2025, 11:58 AM IST

ప్రముఖ ఫార్మా దిగ్గజం రామ రాజు మంతెన కూతురు నేత్ర మంతెన వివాహ వేడుకలో రామ్‌ చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. జెన్నిఫర్‌ లోపెజ్‌ తన డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో ఊపేసింది.  

PREV
16
నేత్ర మంతెన వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో రామ్‌ చరణ్‌, జెన్నిఫర్‌ సందడి

ప్రముఖ అమెరికా బేస్డ్ తెలుగు వ్యాపారవేత్త రామరాజు మంతెన కూతురు నేత్ర మంతెన వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ వివాహ వేడుకగా చెబుతున్నారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలు హాజరయ్యారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.  అందులో భాగంగా గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఆయన బ్లాక్‌ సూట్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పెళ్లి వేడుకలోకి చరణ్‌ ఎంట్రీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇందులో హాలీవుడ్‌ సింగర్‌ జెన్నిపర్‌ పాల్గొనడం విశేషం. 

26
డాన్స్ తో నేత్ర మంతెన పెళ్లి వేడుకని షేక్‌ చేసిన జెన్నిఫర్‌

ఇక మూడు రోజులపాటు జరిగిన నేత్ర మంతెన వివాహ వేడుకలో హాలీవుడ్‌ స్టార్‌, సింగర్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె రామరాజు మంతెనతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఆకట్టుకుంది. ఇందులో ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లో మెరవడం విశేషం. అనంతరం ఆమె సాంగ్స్, డాన్స్ పర్ఫెర్మెన్స్ తో పెళ్లి వేడుకని షేక్‌ చేసింది. ఈ మేరకు ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. వీడియోల్లో ఆమె తన హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌ని ఊపేసింది. 56 ఏళ్ల వయసులోనూ ఆమె ఇచ్చే పవర్‌ప్యాక్ షోలు అభిమానులను ఆశ్చర్యపోతున్నారు. జెన్నిఫర్‌కిది ఇండియాలో తొలి పర్ఫెర్మెన్స్ కావడం విశేషం.

36
జెన్నిఫర్‌ డ్రెస్‌లో విమర్శలు

నేత్ర వెడ్డింగ్‌ రిసెప్షన్ నుంచి వైరల్ అయిన వీడియోల్లో జెన్నిఫర్ లోపెజ్ గోల్డ్ అండ్‌ సిల్వర్‌ కలర్‌ గ్లామరస్ కాస్ట్యూమ్‌లో కనిపిస్తూ, తన హిట్ ట్రాక్స్‌కు స్టేజ్‌పై ఊపిరి ఇస్తూ కనిపించింది. ఒక క్లిప్‌లో ఆమె “Get On The Floor” పాటను పాడుతుండగా, మరికొన్ని వీడియోల్లో “Waiting for Tonight”, “Save Me Tonight”, “Get Right”, “Ain’t Your Mama” వంటి పాపులర్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఎంజాయ్ చేయించింది. పర్ఫెర్మెన్స్ కోసం జెన్నిఫర్‌ బోల్డ్ బాడీ సూట్స్, కట్ అవుట్ డ్రెస్సులతో స్టేజ్‌పైకి రావడంతో, ఆమె అవుట్‌ఫిట్స్‌పై సోషల్ మీడియాలో విభిన్నమైన స్పందన కనిపిస్తోంది. కొంతమంది అభిమానులు ఆమె స్టైల్, కాన్ఫిడెన్స్‌ను ప్రశంసిస్తే, మరికొందరు ఆ దుస్తులు స్విమ్‌సూట్‌లా ఉన్నాయని, ఇండియాలో ఇలాంటి అవుట్‌ ఫిట్స్‌ అవసరమా? పైగా పెళ్లి వేడుకలో అంటూ ప్రశ్నిస్తున్నారు.

46
ఎవరీ రామ రాజు మంతెన, వంశీ గడిరాజు?

నేత్ర మంతెన ఒర్లాండో కేంద్రంగా ఉన్న ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ ఛైర్మన్, సిఈఓ రామ రాజు మంతెన కుమార్తె. ఈ సంస్థ US, స్విట్జర్లాండ్, భారతదేశంలో ఆపరేషన్స్, R&D సెంటర్లతో జెనరిక్ మెడిసిన్స్ రంగంలో పనిచేస్తోంది. రామ రాజు మంతెనను అనేక మీడియా రిపోర్టులు బిలియనీర్ ఎంట్రప్రెన్యూర్‌గా వర్ణించినప్పటికీ, ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్‌లో  ఆయన పేరు లేకపోవడం గమనార్హం. మరోవైపు, వరుడు వంశీ గడి రాజు Superorder అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి కో–ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. బహుళ బ్రాంచ్‌లున్న రెస్టారెంట్‌లు డెలివరీ, టేక్ అవే ఆపరేషన్లను సులభంగా నిర్వహించేందుకు ఈ కంపెనీ సహకరిస్తోంది. మీడియా రిపోర్టుల ప్రకారం Superorder సంస్థ విలువ సుమారు 18 నుంచి 25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.208 కోట్లు) ఉంటుందని అంచనా. ఫుడ్ అండ్ డ్రింక్ విభాగంలో ఆయన 2024 ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నారు.​

56
డోనాల్డ్ ట్రంప్‌ జూనియర్‌తో రామ్‌ చరణ్‌ సందడి

నేత్ర, వంశీ వివాహ వేడుకలో రామ్‌ చరణ్‌తోపాటు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరయ్యారు. పలు ఫంక్షన్‌లలో ఆయన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జంట సాంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్‌లు రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, కృతి సనన్, జాన్వీ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధవన్, నోరా ఫతేహి తదితరులు స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేస్తూ, ఈ విలాసవంతమైన వివాహాన్ని స్టార్ స్టడెడ్ ఈవెంట్‌గా మార్చారు. ఇప్పుడిది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో చరణ్‌.. డోనాల్డ్ ట్రంప్‌ జూనియర్‌తో సరదా సంభాషణ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

66
మంతెన పెళ్లి వేడుకకి తెలుగు నుంచి చరణ్‌ ఒక్కరే

రామ్‌ చరణ్‌ ఫార్మా దిగ్గజం రామరాజు మంతెనతో కలిసి దిగిన ఫోటో ఇది. టాలీవుడ్‌ నుంచి రామ్‌ చరణ్‌ మాత్రమే ఈ అత్యంత ఖరీదైన ఈవెంట్‌కి హాజరు కావడం విశేషం. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం చరణ్‌ `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే సమ్మర్‌కి ఈ మూవీ విడుదల కాబోతుంది 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories