మా బ్లాక్ బస్టర్ నిర్మాతలు నవీన్, రవి గారికి కంగ్రాట్స్. నాకు రంగస్థలం లాంటి గ్రేట్ మెమొరబుల్ ఫిలిం ఇచ్చారు. మైత్రి సంస్థలో పని చేసిన ప్రతి హీరోకి మెమొరబుల్ ఫిలిమ్స్ దక్కాయి. ఆ ఘనత సాధించిన ఏకైక సంస్థ మైత్రి. మైత్రి నిర్మాతలు నవీన్, రవిగారు నేరుగా ఇండస్ట్రీలోకి రాలేదు. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ తెలుగు మాస్ సినిమాపై ప్రేమతో వచ్చారు.