ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌.. పఠాన్‌ డైరెక్టర్‌ భారీ స్కెచ్‌.. బాక్సాఫీసుకి పూనకాలే?

Published : Jan 29, 2023, 12:56 PM ISTUpdated : Jan 29, 2023, 02:39 PM IST

ఇప్పటికే పలు ఊహించిన కాంబినేషన్లతో సినిమాలు సెట్‌ అవుతున్నాయి. ఇండియన్‌ సినిమా రూపురేఖలను మార్చేస్తున్నాయి. లేటెస్ట్ గా మరో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసే కాంబినేషన్‌ సెట్ కాబోతుందని సమాచారం. 

PREV
16
ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌..  పఠాన్‌ డైరెక్టర్‌ భారీ స్కెచ్‌.. బాక్సాఫీసుకి పూనకాలే?

గత మూడు నాలుగేళ్లుగా ఇండియన్‌ సినిమాలో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంచలన కాంబినేషన్లు సెట్‌ అవుతున్నాయి. భాషల మధ్య బారియర్స్ బ్రేక్‌ అవుతున్నాయి. బౌండరీలు దాటుకుని సినిమాలొస్తున్నాయి. పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. మున్ముందు ఇండియన్‌ బారియర్స్ బ్రేక్‌ చేసే కాంబినేషన్లు సెట్‌ కాబోతుండటం విశేషం. స్టార్‌ డైరెక్టర్స్ ఊహించని ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నారు. `కేజీఎఫ్‌` సిరీస్‌, `విక్రమ్‌` సిరీస్‌, `పొన్నియిన్‌ సెల్వన్‌`, `పుష్ప`, RRR వంటి చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కాయి. మున్ముందు మరిన్ని రాబోతున్నాయి. 
 

26

అందులో భాగంగా పాన్‌ ఇండియా స్టార్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా టర్న్ తీసుకుంటున్నా ప్రభాస్‌ మరో సంచలన చిత్రంలో భాగం కాబోతున్నారు. ఆయన బాలీవుడ్‌ గ్రీక్‌ వీరుడు హృతిక్‌ రోషన్‌ కలిసి ఓ సినిమా చేయబోతుండటం విశేషం. వీరిద్దరు హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్‌కి ప్లాన్‌ జరుగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 
 

36

దీనికి `పఠాన్‌` దర్శకుడు సిద్ధార్త్‌ ఆనంద్‌ భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారట. సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్‌ ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్‌డేట్‌ లేదు. తాజాగా ఆయన రూపొందించిన `పఠాన్‌` సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ప్రభాస్‌ ప్రాజెక్ట్ కి తెరపైకి తీసుకొస్తున్నారట. ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా ఇండియన్‌ సినిమాలో ఇప్పటి వరకు రానీ, కనీవిని ఎరుగని విధంగా ఈ సినిమాని తెరకెక్కించాలని సిద్ధార్థ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. 
 

46

అయితే ఈ చిత్రాన్ని తెలుగు ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ నిర్మిస్తుండటం విశేషం. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థతోనూ కలిసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేలా ప్లాన్‌ జరుగుతుందని, 2025లో విడుదల చేసేలా ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదొక ప్రాంఛైజీగా రాబోతుందనేది లేటెస్ట్ టాక్‌. సిద్ధార్థ్‌ ఆనంద్ `బ్యాంగ్‌ బ్యాంగ్‌` చిత్రాలతో యాక్షన్‌ కామెడీ సినిమాలకు తెరలేపారు. హృతిక్‌ ఇందులో నటించారు. ఇటీవల ఆయన హీరోగానే `వార్‌`ని తెరకెక్కించారు. ఇప్పుడు షారూఖ్‌తో `పఠాన్‌` చేసి సంచలన హిట్‌ కొట్టారు. మరోవైపు హృతిక్‌తోనే `ఫైటర్‌` అనే మరో యాక్షన్‌ మూవీ చేస్తున్నారు సిద్ధార్థ్‌. 

56

`ఫైటర్‌` అనంతరం ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేశారట. అయితే ఇది `ఫైటర్‌` సిరీస్‌లో భాగంగా ఉంటుందని సమాచారం. పాన్‌ ఇండియాని మించి, గ్లోబల్‌ మార్కెట్‌ లక్ష్యంగా భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్ తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ప్రభాస్‌ ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేసింది. ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి సినిమా చేస్తే అది ఊహకందని విధంగా ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

66

ప్రభాస్‌ ప్రస్తుతం `సలార్‌`, `ప్రాజెక్ట్ కే`, `ఆదిపురుష్‌`తోపాటు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో మూడు పాన్ ఇండియా మూవీస్‌. వాటిలో ఒకటి రెండు హిట్ అయినా ప్రభాస్‌ గ్లోబస్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవడం ఖాయం. ఆ తర్వాత ఆయన చేసే సినిమాల రేంజ్‌ మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories