తన నెక్ట్స్ ఫిల్మ్ ను అనౌన్స్ చేసిన ప్రణీత.. మలయాళం సూపర్ స్టార్ సినిమాలో బుట్టబొమ్మ

First Published | Jan 29, 2023, 12:48 PM IST

హీరోయిన్ ప్రణీత తను నెక్ట్స్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత తను నటించబోతున్న తొలిచిత్రం కాబోతుండటం విశేషం. దీంతో ఆమె అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

గ్లామరస్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు, కన్నడ, తమిళంలోనూ నటించి మెప్పించారు.. తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. 
 

స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలో 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజు ను ప్రణీత సుభాష్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. 2022 జూన్ 10న బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 


పెళ్లి, ప్రెగెన్సీ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.. కానీ పెళ్లికి, సినిమాకు సంబంధం లేదంటూ, దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇస్తున్నట్టు తెలియజేసింది. ఇన్నిరోజులు ఫ్యామిలీతో గడిపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన నెక్ట్స్ ఫిల్మ్ ను కూడా అనౌన్స్ చేసింది

మలయాళం సూపర్ స్టార్ దిలీప్ (Dileep) సరసన నటించబోతుంది. సీనియర్ నటుడు దిలీప్ 148వ చిత్రంతో ప్రణీత తొలిసారిగా మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ మరింత జోరుగా సాగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

D148 వర్క్ టైటిల్ తో ప్రస్తుతానికి సినిమాను ప్రారంభించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్బీ చౌదరి సమర్పణలో సినిమాను రూపొందిస్తున్నారు. రతీష్ రఘునందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్బీ చౌదరి, రాఫీ మతిర్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

తొలిసారిగా మలయాళంలో అడుగుపెట్టబోతుండటంతో ప్రణీత ఫ్యాన్స్ మద్దతు కోరింది. ప్రేక్షకుల దీవెనలు ఉండాలని ఆశించింది. ఈ సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ క్లాప్ బోర్డ్ ను చూపిస్తున్న రెండు ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. అలాగే ప్రణీత కన్నడలోనూ ‘రమణ అవతార’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. కరోనాతో ఆలస్యం అవుతూ   ఈ ఏడాదిలో మార్చిలో రిలీజ్ చేయబోతునన్నారని టాక్ వినిపిస్తోంది.

Latest Videos

click me!