చిరంజీవి ఇంట్లో అంత డిఫరెంటా?.. వామ్మో మెగాస్టార్‌ లోని ఎవరికి తెలియని యాంగిల్‌ బయటపెట్టిన రామ్‌ చరణ్‌

Published : Mar 20, 2024, 07:04 PM ISTUpdated : Mar 21, 2024, 09:18 AM IST

మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు రామ్‌చరణ్‌. బయట నవ్వించే చిరు ఇంట్లో ఎలా ఉంటాడో వెల్లడించారు.   

PREV
17
చిరంజీవి ఇంట్లో అంత డిఫరెంటా?.. వామ్మో మెగాస్టార్‌ లోని ఎవరికి తెలియని యాంగిల్‌ బయటపెట్టిన రామ్‌ చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి బయట ఈవెంట్లలో ఎంతో సరదాగా ఉంటారు. స్టేజ్‌పైకి వచ్చారంటే నవ్వులు పూయించకుండా ఉండరు. సరదాగా పంచ్‌లు వేస్తూ, ఆటపట్టిస్తూ, ఇమిటేట్‌ చేస్తూ అలరిస్తుంటారు. ఆద్యంతం నవ్వులు పంచుతారు. చాలా వరకు అందరిని నవ్వించే ప్రయత్నం చేస్తారు. కొంత హుందాగానూ వ్యవహరిస్తారు. తన రేంజ్‌కి తగ్గట్టుగానే ఉంటాడు. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు.  

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

27
Chiranjeevi

కానీ చిరంజీవి ఇంట్లో ఎలా ఉంటాడు. ఫ్యామిలీతో ఆయన ఎలా మూవ్‌ అవుతాడు. వారితో ఎలా గడుపుతాడు. ఇలాంటి ఫన్నీ యాక్టివిటీస్‌ చేస్తుంటాడు. అద్భుతమైన డాన్సులతో వెండితెరపై రచ్చ చేసే చిరంజీవి, ఇంట్లోనూ డాన్స్ మూమెంట్లతో అలరిస్తాడా? ఇంట్లోనూ ఫ్యామిలీ మెంబర్స్ తో అంతే జోవియల్గా ఉంటాడా? అని అనిపిస్తుంటుంది. కానీ ఇంట్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారట. 
 

37

రామ్‌ చరణ్‌ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇంట్లో మాత్రం పూర్తి భిన్నమైన చిరంజీవిని చూస్తారట. ఇంట్లో ఆయన అస్సలు ఫన్‌ చేయరట. చాలా వరకు సీరియస్‌గా కనిపిస్తారట. అదే సమయంలో సింపుల్‌గానే ఉంటారట. మెగాస్టార్‌ అనే ఇమేజ్‌ మాత్రం ఆయనలో ఏమాత్రం కనిపించదని, సాధారణ ఫాదర్‌లాగే, సాధారణ భర్తలాగే ఉంటారని తెలిపారు రామ్‌చరణ్‌. 
 

47

ఇంట్లో ఏమాత్రం జోకులు వేయడం గానీ, నవ్వించడం గానీ చేయరని, ఎవరైనా కామెడీ చేస్తే నవ్వుతాడు, దాన్ని ఎంజాయ్‌ చేస్తాడని తెలిపారు. అదే సమయంలో డాన్సులు కూడా చేయడం చూడలేదని, ఎప్పుడో తాము చిన్నప్పుడు తమకి ట్రైనింగ్‌ ఇచ్చేటప్పుడు చేశాడు అని, మళ్లీ ఆయన ఇంట్లో డాన్స్ చేయడం చూడలేదని తెలిపారు. 
 

57

ఇక ప్రాక్టికల్‌గా ఉంటాడట చిరంజీవి. నాన్నతో తాము ఫ్రీగానే ఉంటామని, ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుకుంటామని తెలిపారు. కాకపోతే ఆయన మూడ్‌ని బట్టి మాట్లాడతానని తెలిపారు చరణ్‌. బిజీగా ఉన్నాడా, అలసిపోయాడా? మూడ్‌ బాగానే ఉందా అనేది చూసుకుని వెళ్లి మాట్లాడతానని వెల్లడించారు చరణ్‌. కానీ బయట కనిపించేదానికి, బయట ఉండేదానికి ఆయన పూర్తి భిన్నంగా ఉంటారని చెప్పారు. చిరులోని మరో యాంగిల్‌ని బయటపెట్టారు రామ్‌చరణ్‌. 

67

 చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోసియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఐదుగురు కథానాయికలు చిరుకి సిస్టర్స్ గా కనిపిస్తారట. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.  

77

 ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌. ఇక తాజాగా కొత్త సినిమా ప్రారంభమైంది. బుచ్చిబాబు సానతో `ఆర్‌సీ16` చిత్రంలో నటించనున్నారు. ఇది నేడు గ్రాండ్‌గా ప్రారంభమైంది. దీనికి గెస్ట్ గా చిరంజీవి హాజరయ్యారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories