గేమ్ ఛేంజర్: ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయి?, బ్రేక్ ఈవెన్ ఎంత

First Published | Jan 11, 2025, 8:43 AM IST

రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా భారీ అంచనాలతో విడుదలై, మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే, కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నట్లు సమాచారం. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది చూడాలి.


 ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా చేసిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.సంక్రాంతి కానుకగా రూపొంది  పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా కలెక్షన్స్ లో మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోయినట్లు సమాచారం.
 


గేమ్ ఛేంజర్ సినిమా రూ. 400 నుంచి 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ చేసారు. అలాగే  ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ సినిమా రూ. 222 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్, రూ. 425 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడితేనే  బ్రేక్ ఈవెన్. అప్పుడే బాక్సాఫీస్ పరంగా హిట్ అయ్యినట్లు. అయితే ఇప్పుడున్న టాక్ తో అది ఏ మాత్రం రీచ్ అవుతుందనేది వేచి చూడాల్సిన విషయం. 
 



ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం తొలి రోజు  రూ.47 కోట్లు రాబట్టినట్లు చెప్తున్నారు. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.38 కోట్లు వచ్చినట్లు సమాచారం .  అలాగే  ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌ మై షోలో ‘గేమ్‌ ఛేంజర్‌’కు తొలిరోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్‌ అమ్ముడైనట్లు సంస్థ వెల్లడించింది. వీకెండ్ లో  ఈ టికెట్‌ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. 

game changer


సినిమా ఎలా ఉన్నా  అప్పన్న పాత్రలో రామ్‌ చరణ్‌ (Ram Charan) నటనపై  అంతటా ప్రశంసలు వస్తున్నాయి. ‘‘అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలకుగానూ చరణ్‌పై కురిపిస్తున్న ప్రశంసలను చూస్తుండడం సంతోషంగా ఉంది. ఎస్‌.జె. సూర్య, కియారా అడ్వాణీ, అంజలి, నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు శంకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించారు.


‘‘కంగ్రాట్స్‌ డియర్‌ హస్బెండ్‌. ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఒక గేమ్‌ ఛేంజర్‌. లవ్‌ యూ’’ అని ఉపాసన పోస్ట్‌ చేయగా.. ‘‘అప్పన్న పాత్రలో అద్భుతంగా నటించావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాత్రకు ప్రాణం పోశావు. నీ ప్రదర్శన చూస్తుంటే ఒక కలలా అనిపించింది. పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగావు’’ అని సాయి దుర్గాతేజ్‌ పోస్ట్‌ పెట్టారు. 


శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ను నిర్మించారు. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాగా.. ఇందులో ‘నానా హైరానా’ పాటను తొలగించినట్లు టీమ్‌ తెలిపింది. సాంకేతిక కారణాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. జనవరి 14 నుంచి ఈ పాట జోడిస్తామని వెల్లడించింది.  

Latest Videos

click me!