రాంచరణ్ రిజెక్ట్ చేసిన ఈ 6 చిత్రాల గురించి తెలుసా..ఎన్ని ఫ్లాపులంటే, ఒక్క మూవీ పైనే తీవ్ర ఉత్కంఠ

First Published Apr 13, 2024, 10:15 AM IST

చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు హీరోల చేతులు మారుతుంటాయి. కొన్నిసార్లు మంచి కథ కూడా హీరోలకు నచ్చకపోవచ్చు. దర్శకులు నేరేషన్ సరిగా ఇవ్వకపోవచ్చు. మరికొన్నిసార్లు చెత్త కథలని కూడా హీరోలు ఒకే చేసేస్తుంటారు.

చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు హీరోల చేతులు మారుతుంటాయి. కొన్నిసార్లు మంచి కథ కూడా హీరోలకు నచ్చకపోవచ్చు. దర్శకులు నేరేషన్ సరిగా ఇవ్వకపోవచ్చు. మరికొన్నిసార్లు చెత్త కథలని కూడా హీరోలు ఒకే చేసేస్తుంటారు. అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాత్రం కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. రిజెక్ట్ చేసిన చిత్రాల జాబితా చూస్తే రాంచరణ్ జడ్జిమెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

జోష్ : మగధీర తర్వాత రాంచరణ్ చేయాల్సిన చిత్రం జోష్. స్వయంగా దిల్ రాజు వెళ్లి రాంచరణ్, చిరంజీవిని అడిగారు. మగధీర తర్వాత చరణ్ ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదు అని చిరంజీవి రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా వివరించారు. జోష్ రిలీజ్ అయి నిరాశపరిచిన తర్వాత చిరంజీవి గారి అనుభవం అర్థం అయింది అని దిల్ రాజు తెలిపారు. 

ఓకె బంగారం : 2014లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదనిపించే విజయం సాధించింది. మణిరత్నం మొదట ఈ చిత్రాన్ని రాంచరణ్ తో చేయాలనుకున్నారు. కథ బావున్నప్పటికీ తన ఇమేజ్ కి ఈ చిత్రం సెట్ కాదని చరణ్ రిజెక్ట్ చేశాడు. 

సూర్య సన్నాఫ్ కృష్ణన్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో సూర్య నటన అద్భుతం. వివిధ షేడ్స్ లో సూర్య పలికించిన ఎమోషన్స్, హావభావాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈ చిత్రాన్ని మొదట గౌతమ్ మీనన్ రాంచరణ్ తో చేయాలనుకున్నారు. ఆ సమయంలో చరణ్ మగధీరతో బిజీగా ఉండడం వల్ల ఈ చిత్రానికి ఒకే చెప్పలేకపోయారు. 

ఎటో వెళ్ళిపోయింది మనసు : ఎలాగైనా రాంచరణ్ తో సినిమా చేయాలనీ గౌతమ్ మీనన్ మరో ప్రయత్నం చేశారు. ఈ కథని రాంచరణ్ కి వినిపించారు. ఆల్రెడీ ఇదే తరహాలో చేసిన ఆరెంజ్ మూవీ వర్కౌట్ కాకపోవడంతో చరణ్ రిస్క్ తీసుకోలేదు. గౌతమ్ మీనన్ కి రెండోసారి కూడా నో చెప్పారు. దీనితో ఈ మూవీ నాని చేతుల్లోకి వెళ్ళింది. ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. 

VD 12: ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించాల్సింది. వీళ్లిద్దరి కాంబినేషన్ కి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే కథ పూర్తి స్థాయిలో నచ్చక పోవడంతో చరణ్ ఈ చిత్రానికి నో చెప్పాడు. దీనితో అదే కథతో గౌతమ్.. విజయ్ దేవరకొండ తో చేస్తున్నారు. ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఏజెంట్ : ఆల్రెడీ సురేందర్ రెడ్డి, రాంచరణ్ కాంబినేషన్ లో ధృవ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి రామ్ చరణ్ తో ఓ చిత్రం చేయాలనుకున్నారు. చరణ్ కి ఓ యాక్షన్ మూవీ కథ లైన్ వినిపించారట. అయితే చరణ్ కొన్ని కారణాలతో సున్నితంగా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రిజెక్ట్ చేసిన చిత్రమే ఏజెంట్ అనే ప్రచారం కూడా ఉంది. రాంచరణ్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ కథ అఖిల్ వద్దకు వెళ్లిందని రూమర్స్ వ్యాపించాయి. అయితే ఏజెంట్ చిత్రం సురేందర్ రెడ్డి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

click me!