ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు : కృష్ణం రాజు

First Published Jun 28, 2022, 6:04 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నెటికి సరిగ్గా 20 ఏండ్లు పూర్తయ్యింది. దీంతో అభిమానులు సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణం రాజు ప్రభాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 
 

డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకుల చే పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు. అదే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ చిత్రం. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను  సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. 
 

అయితే ప్రభాస్ హీరోగా పరిచయం అయి.. అంటే హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నేటితో సరిగ్గా 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ‘ఈశ్వర్’ (Eshwar) అనే సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్ పై ఆయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదగమని దీవించారు.. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు ఆయనా ఊహించలేదు.
 

సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం అవ్వడం అన్నది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది. కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీని తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ళ వాళ్ళ సొంత టాలెంట్ పై ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక ఆయన నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఆదిపురుష్ ను అటు హాలీవుడ్ లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో ఆయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షడు జేఎస్ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈరోజు సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని కొందరు అభిమానులు ఈశ్వర్ సినిమా దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా పాల్గొన్నారు. 
 

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయా అన్న సందేహం కలుగుతుంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. 

ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయని తెలిపారు. 
 

ఆలిండియా రెబల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) మాట్లాడుతూ.. మేను మొదటి నుండి కూడా మా రెబెల్ స్టార్ అభిమానులుగానే ఉన్నాం. ఉంటాం కూడా.  ప్రభాస్ ని హీరోగా పరిచయం చేయాలనీ వైజాగ్ లో సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఇప్పించారు. అప్పుడు ప్రభాస్ ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో తెలుసుకోమని సూర్య నారాయణ రాజు గారు నన్ను వైజాగ్ ఇనిస్టిట్యూట్ కి పంపించారు. నాపై అంత నమ్మకం ఉంది వాళ్లకు. ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
 

ప్రస్తుతం ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీల్లోనే నటిస్తున్నారు. ఆయన నటించిన ‘ఆదిపురుష్’ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్టర్. వచ్చే ఏడాది జనవరిలో మూవీని రిలీజ్ చేయనున్నారు. డార్లింగ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నారు. పార్లల్ గా ‘ప్రాజెక్ట్ కే’నూ పూర్తి చేస్తున్నారు. 

click me!