నితిన్, బాలయ్య చిత్రాలకు షాక్.. మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్

Published : Mar 20, 2025, 09:12 PM IST

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి.

PREV
14
నితిన్, బాలయ్య చిత్రాలకు షాక్.. మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్
Nandamuri Balakrishna

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

24

ఇటీవల విడుదలైన నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రంలో.. బాలయ్య, ఊర్వశి రౌటేలా కలసి చేసిన డ్యాన్స్ మూమెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కేతిక శర్మ ఐటెం సాంగ్ చేస్తోంది. ఆ సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ పాటలో కేతిక చేసిన డ్యాన్స్ మూమెంట్ కూడా వివాదాస్పదమైంది. 
 

34

ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు మరియు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము
 

44

సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయం పై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరించింది. 

Read more Photos on
click me!

Recommended Stories