బాయ్‌ ఫ్రెండ్‌ లేకపోతే మొహం మీద షూ వేసిపోతా.. యాంకర్‌ రష్మితో అందరి ముందు ఫ్లర్ట్ చేసిన జబర్దస్త్ కమెడియన్‌

Published : Apr 23, 2024, 01:40 PM ISTUpdated : Apr 23, 2024, 03:19 PM IST

యాంకర్‌ రష్మికి తీవ్ర అవమానం. బాయ్‌ ఫ్రెండ్‌ లేకపోతే షూ మీద వేసి పోతా అని జబర్దస్త్ కమెడియన్‌ కామెంట్‌ చేయడం హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
18
బాయ్‌ ఫ్రెండ్‌ లేకపోతే మొహం మీద షూ వేసిపోతా.. యాంకర్‌ రష్మితో అందరి ముందు ఫ్లర్ట్ చేసిన జబర్దస్త్ కమెడియన్‌
photos-extra jabardasth promo

రష్మి గౌతమ్‌.. యాంకర్‌గా జబర్దస్త్ షోకి ఫిక్స్ అయిపోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి ఆమె పర్మినెంట్‌ యాంకర్‌గా మారింది. రోజు రోజుకి ఆమె అందం పెరుగుతుంది. ఆమె అభినయం పెరిగిపోతుంది. షోలో ఆమె చేసే, ఆమె మీద చేసే హంగామా పెరుగుతుంది. వినోదాన్ని పంచడంలో సక్సెస్‌ అవుతుంది. దీంతో రష్మికి ఉండే క్రేజ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. 
 

28
photos-extra jabardasth promo

రష్మి గౌతమ్‌ షోలో సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్ చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. షోకి రేటింగ్‌ తేవడంలో అది ఎంతో దోహదపడింది. అయితే సుధీర్‌.. జబర్దస్త్ షోని మానేయడంతో రష్మి ఒంటరిగానే షో చేస్తుంది. అయితే తరచూ కమెడియన్ల నుంచి తన లవ్‌ మ్యాటర్‌ని లాగుతూ సెటైర్లు పేలుస్తున్నారు. సుధీర్‌ ప్రస్తావన తీసుకొస్తున్నారు. దాన్ని నవ్వుతూ తీసుకుంటుంది రష్మి. 

38
photos-extra jabardasth promo

అయితే ఇప్పుడు ఓ జబర్దస్త్ కమెడియన్‌ యాంకర్‌ రష్మి పరువు తీశాడు. స్కిట్‌ చేస్తూ అవమాన కరంగా ప్రవర్తించాడు. `టిల్లు స్వ్కేర్‌` స్కిట్‌ చేస్తూ ఆమెపై చెప్పు వేసి వెళ్లిపోతా అని అనడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే అతను కొత్త కమెడియ్‌ కావడం గమనార్హం. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 
 

48

ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో రామ్‌ ప్రసాద్‌.. రోహిణితో కలిసి రచ్చ చేశాడు, బుల్లెట్‌ భాస్కర్‌.. ఖుష్బుని ఆడుకున్నాడు. రాకింగ్‌ రాకేష్‌ తనదైన స్టయిల్‌లో కామెడీ చేశాడు. చివరగా ఇమ్మాన్యుయెల్‌, వర్ష, బాబులు `టిల్లు స్వ్కేర్‌` స్కిట్‌తో వచ్చారు.

58
photos-extra jabardasth promo

చివరగా ఇమ్మాన్యుయెల్‌, వర్ష, బాబులు `టిల్లు స్వ్కేర్‌` స్కిట్‌తో వచ్చారు. అయితే ఇందులో ఇద్దరు టిల్లు పాత్రలు పెట్టారు. ఓ కొత్త కమెడియన్‌.. యాంకర్‌ రష్మితో ఫర్ట్ చేశాడు. అనుపమా పరమేశ్వరన్‌తో ప్రారంభ సీన్‌లో సిద్దు ఫర్ట్ చేసినట్టుగా ఫాలో అయ్యాడు. 

68
photos-extra jabardasth promo

యాంకర్‌ రష్మిని పట్టుకుని ఎక్కడో మనసు విరిగినట్టున్నది అంటూ ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఉన్నాడా బాయ్‌ ఫ్రెండ్‌ అని అడిగాడు ఆ కమెడియన్‌, దానికి రష్మి నీకెందుకు అని హార్డ్ గా సమాధానం చెప్పింది. దీనికి ఆ కమెడియన్‌ రియాక్ట్ అవుతూ బాంబ్‌ పేల్చాడు. సినిమాలో సిద్దుగా మాదిరిగా రియాక్ట్ అవుతూ రచ్చ చేశాడు. అందులో చిన్న మార్పు చేశాడు. 
 

78

నీకెందుకు అని రష్మి చెప్పగా, ఆ బాయ్‌ ఉన్నాడంటే నా షూట్‌ నేను వేసుకుని వెళ్లిపోతే, లేడంటే ఈ షూ నీ మీద వేసిపోతా అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. దీనికి రష్మికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఏం రియాక్ట్ కావాలో అర్థం కాక నోరెళ్ల బెట్టింది రష్మి. ప్రస్తుతం ఇది రచ్చ రచ్చ అవుతుంది. 
 

88
photos-extra jabardasth promo

లేటెస్ట్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలోని సీన్‌ ఇది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇందులో ఇమ్మాన్యుయెన్‌ మరో టిల్లుగా, వర్ష లిల్లీగా చేసి నవ్వులు పూయించారు. సరదాగా చేసిన ఈ స్కిట్‌ కామెడీని పండించింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories