రాంచరణ్ నటించిన పెద్ది మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో మొదలయ్యాయి. ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. రికార్డులు కూడా షురూ అయ్యాయి.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 350 కోట్ల బడ్జెట్ లో వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రారంభం నుంచి ఈ మూవీపై సాలిడ్ బజ్ నెలకొంది.
25
పెద్ది సినిమాపై భారీ అంచానాలు
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పెద్ది మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే.. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే రికార్డులు బద్దలవుతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
35
ఓజీ రికార్డు బద్దలు
పెద్దిగాడి విధ్వంసం మొదలైది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 24 గంటల్లోనే నార్త్ అమెరికాలో పెద్ది చిత్రం లక్ష డాలర్లు వసూలు చేసింది. ఏకంగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రికార్డ్ ని రాంచరణ్ బద్దలు కొట్టారు. ఓజీ మూవీ నార్త్ అమెరికాలో 24 గంటల్లో 82 వేల డాలర్లు సాధించింది.
పెద్ది మ్యానియా చూస్తుంటే మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. దీనితో మెగా అభిమానులు పెద్ది మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
55
పెద్ది రన్ టైం ఎంతంటే
మొత్తానికి పెద్ది రికార్డుల వేట ఓజీ చిత్రంతోనే ప్రారంభం అయింది. బాబాయ్ సినిమా రికార్డులని అబ్బాయి బ్రేక్ చేశాడు. పెద్ది మూవీ గ్రామీణనేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఆల్రెడీ బుచ్చిబాబు పెద్ది ఫైనల్ ఎడిట్ కూడా కంప్లీట్ చేశారు. ఫైనల్ రన్ టైం మూడు గంటలకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది.