Jr NTR: బాలకృష్ణ, ఎన్టీఆర్ లతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

Published : May 29, 2026, 08:30 AM IST

టాలీవుడ్ లో నందమూరి హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురికి తెలుగు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా? 

PREV
15
నందమూరి హీరోలది ప్రత్యేక స్థానం..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో నందమూరి వంశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ తరువాత ఆఇమేజ్ ను బాలకృష్ణ నిలబెట్టగా.. బాలయ్య తరువాత సినీ వారసత్వాన్ని ఎన్టీఆర్ మరో రేంజ్ కు తీసుకెళ్లాడు. ఇక పెద్దాయన ఇప్పుడు లేకపోయినా.. బాలయ్య, తారక్ మాత్రం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్క హీరో నుంచి సినిమా వచ్చినా.. ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక నందమూరి హీరోలు ముగ్గురు కలిసి నటించిన సినిమా ఒకటుందని మీకు తెలుసా? సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, తారక్ కాంబోలో వచ్చిన సినిమా ఏంటి?

25
మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఏకైక సినిమా..

ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించాడు. అది కూడా బాలయ్య కొడుకుగా తారక్ నటించడం మరో విశేషం. నందమూరి వంశంలో మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే. ఇంతకీ ఆ ఆ అద్భుతం మరేదో కాదు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' మూవీ. అదేంటి ఈసినిమాలో తారక్ లేడు కదా..? అని చాలామందికి అనుమానం రావచ్చు. అయితే ఈసినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ పెద్ద కథే ఉంది. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తెలుగు వర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడు. తారక్ ను హిందీ వెర్షన్ సినిమాలో మాత్రమే తీసుకున్నారు.దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

35
బాలయ్య, ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించిన సినిమా

బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం కావడంతో. రాజకీయాల్లో ఈసినిమా పెద్ద ప్రకంపనలే సృష్టించింది. తెలుగులో విడుదలై విమర్శల పాలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా.. ఆర్థికంగా కూడా నష్టాలు తీసుకువచ్చింది. 

ఎవరైనా నష్టాలువస్తే.. మళ్లీ ఆ సినిమా జోలికి వెళ్లరు. కానీ అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ కూడా షూటింగ్ ఒకే సారి కంప్లీట్ చేశారు. .. బాలీవుడ్ లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని అంతా సిద్దం చేశారు. ఇందులో ఎన్టీఆర్ స్వయంగా విశ్వామిత్రుడు పాత్రలో నటించగా, బాలకృష్ణ దుష్యంతుడు గా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దుష్యంతుడు, శకుంతల కుమారుడైన భరతుడు పాత్రలో కనిపించాడు. బాలయ్య తండ్రి పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్రలో కనిపించిన ఏకైక చిత్రం కూడా ఇదే.

45
తారక్ టాలెంట్ చూసి షాక్ అయిన ఎన్టీఆర్.

ఫిల్మ్ ఇండస్ట్రీలో తారక్ మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హిందీ నైపుణ్యం ఉన్న తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతికారట. అప్పట్లో ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం షూటింగ్ సమయంలో తారక్ హిందీ మాట్లాడిన తీరుతో ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, వెంటనే ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారట. కానీ ఈసినిమా రిలీజ్ అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఆ సినిమా తెరపైకి రాలేదు. బ్రహ్మర్షి విశ్వామిత్ర’ తెలుగు వెర్షన్ ఫెయిల్యూర్ అవ్వడంతో హిందీలో రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో హిందీ వెర్షన్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

55
బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్

నందమూరి ఫ్యామిలీలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు కూడా రెండు వార్గాలుగా మారిపోయారు. ఇక ఎన్టీఆర్, బాలయ్య మధ్య గొడవలంటూ ఎన్నో వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. 

ఇటు సినిమాల పరంగా, అటు పొలిటికల్ గా కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ విషయాలను తమకు అనకూలంగా మార్చుకుంటున్నారు ప్రత్యర్ధులు. బాలయ్య పేరతో ఎన్టీర్ ను, ఎన్టీఆర్ పేరుతో బాలయ్యను విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడు బహిరంగంగా విమర్శలు చేసుకున్నది లేదు.

Read more Photos on
click me!

Recommended Stories