Anasuya Bharadwaj: అనసూయ పోస్ట్ దుమారం, అసలు రంగు బయటపడింది.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఈ నీతులు ఏమయ్యాయి?

Published : Jun 06, 2026, 04:27 PM IST

Anasuya Bharadwaj: అనసూయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ దుమారం రేపుతోంది. పెద్ది వివాదాన్ని మరింత పెద్దది చేస్తుంది. అదే సమయంలో అనసూయ అసలు రంగు బయటపడిందంటూ నెటిజన్లు ఆమెని ఆడుకుంటున్నారు. 

PREV
110
అనసూయ భరద్వాజ్‌ పోస్ట్ దుమారం

మాజీ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌.. ఏం చేసినా అది సంచలనమే. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. ఏదైనా సామాజిక అంశంపై అనసూయ స్పందిస్తే, దాంట్లో తప్పులు తీస్తుంటారు నెటిజన్లు. ఆమెని టార్గెట్‌ చేస్తూ కామెంట్లు పెడుతుంటారు. అన్ని రకాలుగా ఆడుకుంటుంటారు. ఇప్పుడు మరోసారి అనసూయని టార్గెట్‌ చేస్తున్నారు. ఆమె సినిమాలకు సంబంధించిన పెట్టిన భారీ పోస్టే అందుకు కారణం. సినిమా ప్రభావం పిల్లలపై ఉంటుందనేది తాను నమ్మను అని, కానీ కొన్ని సామాజిక అంశాల విషయంలో మేకర్స్ గా మనం జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇందులో తెలిపింది.

210
పెద్ది వివాదం నేపథ్యంలో అనసూయ పోస్ట్ రచ్చ

తాజాగా రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` సినిమాలో జాన్వీ కపూర్‌కి సంబంధించిన సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఇబ్బంది కలిగించే ఆయా సన్నివేశాలను తొలగిస్తున్నట్టు దర్శకుడు బుచ్చిబాబు సానా వెల్లడించారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ క్రమంలో తాజాగా అనసూయ పెట్టిన పోస్ట్ దాన్ని ఉద్దేశించే అని అంతా భావిస్తున్నారు. మరి ఇంతకి అనసూయ ఏం చెప్పిందనేది చూస్తే, సినిమా ఎల్లప్పుడు సమాజానికి ప్రతిబింబంగానే ఉందని, కానీ సమాజాన్ని పెంచే, విద్యావంతులను చేసే ఏకైక బాధ్యతను దానిపైనే మోపాలని తాను నమ్మడం లేదని తెలిపింది.

310
సినిమా కేవలం ఫిక్షన్‌ మాత్రమే

సినిమా అనేది ఒక ఫిక్షన్‌ మాత్రమే అని, ఏది సరైనదో, ఏది తప్పో విచక్షణ చూపగల సామర్థ్యం, బాధ్యత మనందరిపై ఉందని, పిల్లల పెంపకం సినిమాల ద్వారా జరగాలని తాను నమ్మడం లేదని చెప్పింది.  అదే సమయంలో స్టోరీ టెల్లర్స్ గా మన బాధ్యతలన్నింటి నుంచి ఇది మనల్ని తప్పిస్తుందని కూడా తాను అనుకోవడం లేదని, మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, సినిమా పవర్‌ఫుల్‌ మీడియం అని చెప్పింది. అది చర్చకు తెరలేపుతుందని, అవగాహనలను ప్రభావితం చేస్తుందని, కొన్ని సార్లు ప్రవర్తలను కూడా ప్రేరేపిస్తుందని చెప్పింది అనసూయ.

410
హీరో, విలన్‌ అనే తేడా తగ్గిపోయింది

సాధారణంగా  హీరో మనం మెచ్చుకునే విలువలకు ప్రతీకగా ఉండేవారు, ప్రతినాయకుడు మనం అనుకరించకూడదని విధంగా ఉండేవారు, అయితే ఇప్పుడు ఆ గీత తరచూ అస్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కీర్తించడానికీ, వాస్తవిక చిత్రణకూ మధ్య ఉన్న వ్యత్యాసం అస్పష్టంగా మారుతుందని చెప్పింది అనసూయ.

510
నేను కూడా ఇబ్బంది పడ్డాను

`నేను ఇలాంటి విషయాల గురించి మాట్లాడినప్పుడల్లా చైతన్యం కోసం సెన్సార్‌షిప్‌ను సమర్థించడం లేదు. మనం ఒక కథను చెప్పాలని ఎంచుకున్నప్పుడు దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు, ప్రేక్షకులు ఇలా ప్రతి ఒక్కరికీ ఇందులో పాత్ర ఉంటుంది. నా అభిప్రాయాలు, వైఖరులు క్రియేటివిటీకి ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో నేను కూడా ఒక షో నుంచి తప్పుకున్నాను.  నా ప్రతిభని ప్రదర్శించడానికి ఒక స్టేజ్‌ని కనుగొనడంలో చివరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నేను నా లక్ష్యాన్ని కనుగొన్నాను, అదే సమయంలో నేను నమ్మిన దాని విషయంలో ఎప్పుడూ వెనకాడను, నమ్మినదాని కోసం నిలబడతాను` అని చెప్పింది అనసూయ.

610
ప్రశ్నించడం పట్ల సంతోషిస్తున్నా

క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ చాలా అవసరం, అదే విధంగా స్వేచ్ఛ, బాధ్యత రెండూ కలిసి ఉండగలవనే అవగాహన కూడా అంతే అవసరం. సినిమాలు సమాజానికి తల్లిదండ్రులుగా ఉండాలని ఆశించకుండా, వాటికి ఎలాంటి ప్రభావం లేదని, నటించకుండా ఉండటం, సమాజంలోని ప్రతి చర్యకు కేవలం సినిమాను మాత్రమే బాధ్యురాలిగా చేయలేమని నేను నమ్ముతున్నప్పటికీ, ఈ చర్చ ప్రారంభించానికి,   ప్రశ్నించడానికి సోషల్‌ మీడియాలో చాలా గొంతులు ముందుకు రావడం చూసి నేను నిజంగా సంతోషిస్తున్నా. విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, అవసరమైనప్పుడు విషయాలను ఎత్తిచూపడం అనేది సృజనాత్మకమైన దాడి చేయడం కాదు, అది అవగాహన కల్పించడం మాత్రమే.

710
మరింత బాధ్యత అవసరం

నా ఆశ ఏంటంటే, కనీసం ఇప్పటి నుంచైనా మనమందరం, క్రియేటర్స్, దర్శకుడు, నిర్మాతలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకులు, మనం కంటెంట్‌ని సృష్టించే, వినియోగించే, వ్యాప్తి చేసే విధానంలో మరికొంత సామాజిక స్పృహతో, మరికొంత బాధ్యతాయుతంగా నిందించుకునే విషయం కాదు, మనమందరం ఒకే వ్యవస్థలో భాగమని గుర్తించడం, అలాగే మనం తీర్చిదిద్దే సంస్కృతి అనేది ఉమ్మడి బాధ్యత అని గ్రహించడం చాలా ముఖ్యం.

810
పెద్దిని సమర్థిస్తూ అనసూయ పోస్ట్

నా ఉద్దేశ్యంలో ఇది స్వేచ్ఛ బాధ్యతల మధ్య ఒకదాన్ని ఎంచుకునే విషయం కాదు, ఆ రెండింటినీ సమర్థంగా నిర్వహించగల వివేకాన్ని కలిగి ఉండటం ముఖ్యం. ఎందుకంటే మనకు నచ్చినా, నచ్చకపోయినా మనమందరం ఇందులో భాగమే` అని చెప్పింది అనసూయ. మొత్తంగా సినిమా ప్రభావం జనాలపై ఉంటుందని చెప్పడం సరికాదని, అలాగే మేకర్స్ కూడా బాధ్యతగా ఉండాలని అనసూయ చెప్పింది. పెద్ది విషయంలో నెలకొన్న వివాదాన్ని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని, ఆ మూవీ మేకర్స్ ని సమర్థిస్తూనే ఆమె ఈ విషయాన్ని వెల్లడించిందని అంతా భావిస్తున్నారు.

910
అనసూయపై విమర్శలు

దీంతో చాలా వరకు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చెప్పింది నిజమే అంటున్నారు. కానీ కొంత మంది అనసూయని టార్గెట్‌ చేస్తున్నారు. పెద్ది విషయంలో ఇంతటి నీతులు చెబుతున్న అనసూయ.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఎందుకలా చేసింది, అప్పుడెందుకు ఈ నీతులు చెప్పలేదు. దాన్ని ఎందుకు వివాదం చేసిందని విమర్శిస్తున్నారు. ఒకరు చేస్తే చమత్కారం, ఇంకొకరు చేస్తే బలత్కారమా అంటూ ప్రశ్నిస్తున్నారు. నీ అసలు రంగు బయటపడిందంటున్నారు. నువ్వు నీతులు చెబితే నవ్వు వస్తుందని, అర్జున్‌ రెడ్డి టైమ్‌లో యాక్టింగ్‌ చేశావా? లేక ఇప్పుడు యాక్టింగ్‌ చేస్తున్నావా? అంటున్నారు.

1010
అర్జున్‌ రెడ్డి విషయంలో ఈ నీతులు ఏమయ్యాయి?

మరి ఇంత చెప్పినదానివి అర్జున్‌ రెడ్డి విషయంలో నీకు ప్రాబ్లమ్‌ ఏంటి? అని కొందరు, అందరు హీరోయిన్‌ గురించే మాట్లాడుతున్నారు, రామ్‌ చరణ్‌ కూడా బట్టలు విప్పాడు, అప్పలసూరి బట్టలు కూడా విప్పించారు. కానీ మహిళా సింపతీనే ఎందుకు అంటున్నారు. మొత్తంగా అనసూయని ఆడుకుంటున్నారు. శివాజీ డ్రెస్సులపై కామెంట్‌ చేసినప్పుడు అటు మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో రచ్చ చేసి సైలెంట్‌ అయిన అనసూయ.. కొంత గ్యాప్‌తో మళ్లీ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. మరి ఇది ఎంత కాలం నడుస్తుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories