బయటకొచ్చిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సెట్‌లోని రామ్‌చరణ్ ఫోటోలు‌‌.. పక్కన ఉన్న బుడ్డోడెవరు?

First Published | Jun 28, 2021, 8:55 PM IST

తెలుగులోనే కాదు, ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం `ఆర్ఆర్‌ఆర్`. ఈ చిత్ర షూటింగ్‌ స్పాట్‌లోని రామ్‌చరణ్‌ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడివి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో చెర్రీ పక్కన బుడ్డోడెవరనేది ఆసక్తికరంగా మారింది. 

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా రూపొందుతుంది. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
సెకండ్‌ వేవ్‌ కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత వారంలో `ఆర్‌ఆర్‌ఆర్` షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. తొలి రోజు రామ్‌చరణ్‌ సెట్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని హెయిర్‌ స్టయిలీస్ట్ ఆలిమ్‌ ఆకిమ్‌ తెలిపారు.

తాజాగా షూటింగ్‌ సెట్‌లోని రామ్‌చరణ్‌ ఫోటోలు బయటకు వచ్చాయి, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో ఓ బుడ్డోడితో రామ్‌చరణ్‌ సరదాగా మాట్లాడుతున్నాడు. టిక్‌టాక్‌లో చిన్నోడు భలేగా ఉన్నాడు. మరి ఇంతకి ఆ బుడ్డోడు ఎవరనేది సస్పెన్స్ నెలకొంది.
తన చిన్ననాటి పాతలో కనిపించబోతున్న చిన్నోడా? లేక సినిమాలో ఆ చిన్నోడికి ఏదైనా పాత్ర ఉందా?, అదీ కాకుండా చరణ్‌ బంధువులకు చెందిన కుర్రాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన అలియా భట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్‌ వాయిదా పడటంతో విడుదలపై సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాలో రామ్‌చరణ్‌, అలియా భట్‌లపై ఓ సాంగ్‌ని, అలాగే క్లైమాక్స్ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొననున్నారట.

Latest Videos

click me!