డైరెక్టర్ వివి వినాయక్ ని రాంచరణ్ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాంచరణ్ తన లుక్ కంప్లీట్ గా తెలియకుండా హ్యాట్ పెట్టుకుని ఉన్నారు. కానీ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. గుబురు గడ్డంతో సింహంలా ఉన్నాడు అంటూ ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలని వైరల్ చేస్తున్నారు. మగధీర, రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల్లో చరణ్ బెస్ట్ లుక్ లో కనిపించాడు. ఆర్సీ 16 లుక్ అంతకి మించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.