
ఇండస్ట్రీ ఎవరి అదృష్ట,దురదృష్టాలు వాళ్ళవే. టాలెంట్ త పాటు అదృష్టం కూడా ఉండాలనేది నిజం అంటారు. అదే సమయంలో వారసత్వం కూడా చాలా సార్లు వర్కవుట్ కాదు. నెపోటిజం అంటూ చాలా సార్లు చర్చ జరుగుతుంది. అయితే నెపోటిజం అయినా వారసత్వం అయినా తొలి చిత్రం వరకూ పనికొస్తుంది.
అదే సమయంలో స్టార్ వారసలకు ఎక్సపెక్టేషన్స్ కూడా ఉంటారు. ఫ్యాన్స్ అయినా మరొకరు అయినా సినిమాలో కంటెంట్ లేకుండా మోయరు. విషయంలేని హీరోని ఎంతోకాలం భుజాన వేసుకుని తిరగరు. ఈ విషయాన్నే బండ్లన్న అదే బండ్ల గణేష్ ఓ సారి చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరణగా విజయ్ దేవరకొండ, పూరి జగన్ కొడుకు ఆకాష్ ని తీసుకొచ్చాడు.
విజయ్ దేవరకొడకు సినిమా నేపధ్యమే లేదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి నిలబడ్డమే కాకుండా ఎంతోమంది స్పూర్తిగా నిలిచాడు. కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్స్, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు.
'ఎవడే సుబ్రహ్మణ్యం'లో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన 'పెళ్లిచూపులు' మూవీతో ఫస్ట్ హిట్ కొట్టాడు. ఇక 'అర్జున్ రెడ్డి' మూవీ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎవరిని అడిగినా అదే చెప్తారు.
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్.. ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఆ తర్వాత చేసిన 'గీతగోవిందం' మూవీ విజయ్‌లోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలా వరసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయ్యాడనటం అబద్దమే.
ఎంతో కృషి,పట్టుదల, దీక్ష అతన్ని నెంబర్ వన్ స్దానానికి చేర్చాయి. అయితే ఈ మధ్యన సినిమాల ఎంపిక విషయంలో విజయ్ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు. నోటా, ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఇలా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ కూడా ఎందుకో ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయాయి.
ఇక పూరి కుమారుడు ఆకాష్ విషయానికి వస్తే..టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి . చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ఆపై హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు. 2007లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.
. ఆపై బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్,బిజినెస్‌మేన్,గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిశాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి, మెహబూబా,రొమాంటిక్ వంటి సినిమాల్లో నటించాడు. ఆకాష్ 2018లో తన తండ్రి దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆకాశ్ జగన్నాథ్ కథలు వింటున్నాడు.
చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు ఆకాశ్. కానీ ఫ్లాప్ అయింది. సుమారు రెండేళ్లు సమయం పూర్తి అయినా కూడా ఆకాశ్ నుంచి సినిమా ప్రకటన రాలేదు. కనీసం ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా కనిపించాడు.
తాజాగా తన పేరును 'ఆకాశ్ జగన్నాథ్'గా మార్చుకున్నాడు. ఆకాశ్ పేరు పక్కన తన తండ్రి పేరు నుంచి 'జగన్నాథ్' అనే పదాన్ని ఆయన తీసుకున్నాడు. గతంలో కూడా తన తండ్రి పేరు నుంచే పూరి అనే పదాన్ని తీసుకున్నాడు.ఇక నుంచి 'ఆకాశ్ జగన్నాథ్' అనే తనను పిలవాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పులు వెనుక అసలు కారణాలు ఆయన వెళ్లడించలేదు. సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇక బండ్ల గణేష్ పూరి కు అతి సన్నిహితుడు. నటుడుగా పూరి సినిమాల్లో చేసాడు. అదే విధంగా పూరి తో నిర్మాతగానూ సినిమాలు చేసాడు. ఆ చనువుతోనే ఓ గమ్మత్తైన కామెంట్ చేసారు బండ్ల గణేష్. బండ్ల గణేష్ మాట్లాడుతూ...ఒక సూపర్ స్టార్, మెగాస్టార్ ..వీళ్లందరికి కొడుకులు ఉండవచ్చు. వాళ్లందరూ వాళ్ల వాళ్ల వారసలను తమంతట తాముగా తమలా తయారు చేయలేరు. చేయాలనుకున్నా అవరు. ఎవరి టాలెంట్ వారిదే. నా మిత్రుడే ఉన్నాడు ఒకాయన. పెద్ద డైరక్టర్ అయ్యాడు. వాళ్ల అబ్బాయి స్టార్ కాలేదు. అదే ప్లేస్ లో ఇంకో మిత్రుడు ఉన్నాడు. చిన్న చిన్న వేషాలు వేస్తూ చిన్న సీరియల్ తీసాడు. కట్ చేస్తే వాడి కొడుకు విజయ్ దేవరకొండ అయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు. పెద్ద డైరక్టర్ కొడుకు అన్నది పూరి కొడుకు గురించే అని అందరికి తెలుసు.