Ram charan మీద దేశాలు దాటిన ప్రేమ, మెగా పవర్ స్టార్ కోసం ఇండియా వచ్చిన ఫారెన్ అభిమానులు

Published : Dec 10, 2025, 08:51 PM IST

Ram charan పై అభిమానం దేశాలు దాటింది. మెగా పవన్ స్టార్ ను చూడాలని విదేశీ అభిమానులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. తాజాగా జపాన్ నుంచి వచ్చిన అభిమానుల కోసం చరణ్ ఏం చేశారంటే?

PREV
14
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇండియాన్ సినిమాలు.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు విదేశాల్లో డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్‌లో రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్‌ వేరే స్థాయిలో ఉంటుంది. ‘ఆర్ ఆర్ఆర్ తరువాత చరణ్ సినిమాల కోసం అక్కడి ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు. చరణ్ కోసం ఏకంగా జపాన్ నుంచి ఇండియాకు వచ్చేస్తున్నారు అభిమానులు.

24
చరణ్ కోసం ఇండియాకు

తాజా సమాచారం ప్రకారం, జపాన్‌కు చెందిన కొంతమంది డైహార్డ్ అభిమానులు ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను చూడటానికి ఇండియాకే వచ్చేశారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, ఈ విషయం తెలిసిన వెంటనే వారిని కలవడానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. తనను చూసేందుకే ఇంత దూరం ప్రయాణించిన అభిమానులను చరణ్ ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఇక రామ్ చరణ్ వారితో సరదాగా మాట్లాడుతూ గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. జపాన్ అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగడం, వారిని ఆప్యాయంగా పలకరించడం చూసి నెటిజన్లు చరణ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

34
పెద్ది సినిమాతో బిజీ బిజీ..

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. బుచ్చిబాబు సన డైరెక్షన్ లో రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడ కీలకమైన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను షూట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారట టీమ్.

44
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న పెద్ది సినిమాలో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కనిపించబోతున్నారు. వీరితో పాటు జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ఎప్పటికప్పుడు అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. రామ్ చరణ్ లేటెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు టీమ్.

Read more Photos on
click me!

Recommended Stories