దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్నారు సత్య కృష్ణన్. ఆనంద్ చిత్రంతో సత్య కృష్ణన్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ లాంటి చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల చిత్రాల్లో సత్య కృష్ణన్ అక్క, వదిన తరహా పాత్రలు చేసింది. కానీ ఆనంద్ చిత్రంలో వచ్చిన గుర్తింపు మరే చిత్రంలో రాలేదని సత్య కృష్ణన్ అంటున్నారు.