Ram Charan: మరదలి పెళ్లి వేడుకలో రామ్‌చరణ్‌ సందడి.. భార్య ఉపాసనతో కలిసి డాన్సులు.. వైరల్‌

Published : Dec 09, 2021, 05:58 PM IST

ఓ వైపు రామ్‌చరణ్‌ నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంటే, మరోవైపు తన మరదలి పెళ్లిలో భార్య ఉపాసనతో కలిసి డాన్సులేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. అటు పూనకాలు, ఇటు ఎంజాయమెంట్ తో చరణ్‌ వైరల్‌గా మారారు.   

PREV
18
Ram Charan: మరదలి పెళ్లి వేడుకలో రామ్‌చరణ్‌ సందడి.. భార్య ఉపాసనతో కలిసి డాన్సులు.. వైరల్‌

రామ్‌చరణ్‌ తన మరదలు పెళ్లిలో పాల్గొన్నారు. భార్య ఉపాసన చెల్లి అనుష్ప గత నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతుంది. తాను ప్రేమిస్తున్న అర్మాన్‌ ఇబ్రహీంని పెద్దల అంగీకారంతో మ్యారేజ్‌ చేసుకుంది అనుష్ప. ఇందులో కామినేని కుటుంబం పాల్గొంది. వారితోపాటు మెగా ఫ్యామిలీ సైతం సందడి చేస్తుంది. అందులో భాగంగా మరదలు పెళ్లిలో రామ్‌చరణ్‌ పాల్గొని సందడి చేస్తున్నారు. 

28

ఎంగేజ్‌మెంట్‌ నుంచి పెళ్లి వరకు దోమకొండ గడి కోట వేదికైంది. ఇందులో పోచమ్మ పండుగ నుంచి సంగీత్‌, మెహందీ సెర్మనీ, మ్యారేజ్‌ ఈవెంట్‌ వరకు ఐదురోజులు వేడుకలా జరుగుతుంది. ఈ మ్యారేజ్‌ వేడుకలో చరణ్‌ అప్పీయరెన్స్ హైలైట్‌గా నిలిచింది. 
 

38

ఈ పెళ్లి వేడుకలు మొదలైన రోజు నుంచి ప్రతి అప్డేట్ ను, ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది. తాజాగా పెళ్లి ఘనంగా ముగిసిదంటూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది ఉపాసన.  తన చెల్లెలు పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇది తన జీవితంలోనే ప్రత్యేకమైన రోజు.. సో మచ్ గ్రాటిట్యూడ్ అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.
 

48

అలాగే తన చెల్లెలు పెళ్లికి అందరూ అందించిన విషెస్, ప్రేమకు థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. వాటిలో ఉపాసన, రామ్‌ చరణ్‌ గ్రాండ్‌ లుక్‌లో కలిపించి అలరిస్తున్నారు. చెర్రీ అయితే షేర్వాని ధరించి రాయల్‌ లుక్‌లో అదిరిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

58

ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రి తన భార్య  ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్‌ మరదలితో కలిసి డ్యాన్స్‌ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులెస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.

68

. ఇక సరదగా, సందడి చేస్తున్న చెర్రిని చూసి మెగా ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ఈ వీడియో తమదైన శైలి కామెంట్‌ చేస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు. 
 

78

మరదలు పెళ్లిలో రామ్‌చరణ్‌ సంగీత్‌ కార్యక్రమంలో డాన్సులు చేశారు. భార్యతో కలిసి చిందేశారు. మ్యారేజ్‌ ఈవెంట్‌ని మరింత స్పెషల్‌గా మార్చేశారు.

88

ఇక ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ మరో హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం మార్నింగ్‌ ఉదయం విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఆడియెన్స్ ని మెప్పించింది. గూస్‌ బంప్స్ ని తెప్పిస్తుంది. థియేటర్‌ లో ట్రైలర్‌ విడుదల చేయగా, మారుమోగిపోయిందంటే అతిశయోక్తి కాదు. దీంతో సినిమాపై భారీ అంచనాలను పెంచిందీ ట్రైలర్. ఎన్టీఆర్‌, చరణ్‌ ఎలివేషన్‌ సీన్లు పూనకాలు తెప్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories