అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న రామ్‌చరణ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ పాన్‌ ఇండియా ప్లాన్స్ మైండ్‌ బ్లోయింగ్‌

Published : Jan 14, 2022, 06:50 PM ISTUpdated : Jan 14, 2022, 06:52 PM IST

ఐకాన్‌ స్టార్‌  అల్లు అర్జున్‌.. `పుష్ప` చిత్రంతో తన  హవా నడిపించారు. పాన్‌ ఇండియా లెవల్‌లో ఆ సినిమాని రిలీజ్‌ చేసి సక్సెస్‌  అందుకున్నారు. అయితే ఇప్పుడు బన్నీని `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ ఫాలో అవుతుండటం విశేషం.   ఆ కథేంటో చూస్తే..

PREV
110
అల్లు అర్జున్‌ని  ఫాలో అవుతున్న రామ్‌చరణ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ పాన్‌ ఇండియా  ప్లాన్స్ మైండ్‌ బ్లోయింగ్‌

`అల వైకుంఠపురములో` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు  అల్లు అర్జున్‌(Allu Arjun). త్రివిక్రమ్‌  దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రెండు  వందల  కోట్లకుపైగా కలెక్షన్లని  రాబట్టింది. నాన్‌  బాహుబలి రికార్డులను తిరగరాసింది. తన రికార్డులను తానే బద్దలు  కొట్టారు బన్నీ.  తాజాగా `పుష్ప`(Pushpa) చిత్రంలో  మరో భారీ  విజయాన్ని  అందుకున్నారు. అయితే ఇది పాన్‌ ఇండియా(Pan India) లెవల్‌లో విడుదల కావడం విశేషం. 

210

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `పుష్ప`  డిసెంబర్‌ 17న విడుదలై తొలిత మిక్స్  డ్ టాక్‌ని తెచ్చుకుంది. కానీ నెమ్మదిగా  పుంజుకుంది. హిందీలో ఊహించిన విధంగా ఏకంగా ఎనభై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను, ట్రేడ్‌ వర్గాలను  ఆశ్చర్యానికి గురి  చేసింది. మొత్తంగా  ఈ  సినిమా దాదాపు 320కోట్ల  గ్రాస్‌ని  కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఊహించినదానికంటే భారీ విజయాన్నిసొంతం చేసుకోవడంతో `పుష్ప` టీమ్‌, బన్నీ చాలా  హ్యాపీగా ఉన్నారు. `పుష్ప` రెండో పార్ట్ `పుష్పః ది రూల్‌` కోసం సిద్ధమవుతున్నారు. కరోనా థర్డ్ వేవ్‌ తగ్గుముఖం  పట్టాక ఆ సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారు. 

310

ఇదిలా ఉంటే `పుష్ప` సినిమాని మొదట రెగ్యులర్‌ చిత్రంగానే తెరకెక్కించారు. కానీ రాజమౌళి సలహాతో  పాన్‌ ఇండియాగా మార్చారు. అంతేకాదు రెండు  పార్ట్ లుగానూ  చేశారు. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించినప్పటి నుంచి Allu Arjun వరుసగా ఇతర  సినిమాల ఈవెంట్లలో పాల్గొంటూ ప్రమోట్‌ చేస్తున్నారు. అదే సమయంలో తన సినిమాని,  తనని ప్రమోట్‌ చేసుకుంటున్నారు. అందివచ్చిన  ప్రతి వేదికని పాన్‌ ఇండియా లెవల్‌లో తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు, చేస్తున్నారు  బన్నీ. 

410

`ఆహా`లో  `అన్‌స్టాపబుల్‌` టాక్‌ షోతో బాలకృష్ణతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ రిలేషన్‌తో `అఖండ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు. తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఆ తర్వాత `వరుడు కావలెను`,  `రౌడీబాయ్స్`,వంటి సినిమాల ఈవెంట్లలో సందడి చేశారు. మరోవైపు `పుష్ప` ఈవెంట్లలోనూ తనని పాన్‌ ఇండియా  స్టార్‌గా ఆవిష్కరించుకునేలా ప్రమోట్‌ చేసుకున్నారు. పైగా హిందీలో `పుష్ప` సినిమా బాగా ఆడటంతో బన్నీ రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా  స్టార్‌ ముద్ర వేసుకున్నారు. 

510

అదే సమయంలో ఇతర ఈవెంట్లలో పాల్గొన్నప్పుడుగానీ, త ఈవెంట్లలోనూ ఇతర ఇండస్ట్రీలకు చెందిన సినిమాలను ప్రశంసిస్తున్నారు బన్నీ. విడుదల కాబోతున్న హిందీ సినిమాలు, కన్నడ, మలయాళం,  తమిళం చిత్రాలకు కూడా విషెస్‌ తెలియజేస్తున్నారు. సినిమా గెలవాలనే విషయాన్ని స్ట్రాంగ్‌గా చెబుతున్నారు బన్నీ. ఇలా ఆయా పరిశ్రమలకు కూడా బాగా దగ్గరవుతున్నాడు. పీఆర్‌ పరంగా దూసుకుపోతున్నారని,  ప్రతి  ఈవెంట్లలో తన  పీఆర్‌ని పెంచుకోవడంలో సక్సెస్‌ అవుతున్నాడు ఐకాన్‌ స్టార్‌. 

610

ఇదిలా  ఉంటే ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) కూడా దీన్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఓ రకంగా బన్నీని ఫాలో అవుతున్నారనే టాక్‌ సోషల్‌ మీడియాలో నడుస్తుంది. బన్నీ తరహాలోనే తాను కూడా పాన్‌ ఇండియా  స్టార్‌గా ఇమేజ్‌ని పెంచుకునే పనిలో పడ్డారు Ram Charan. చాలా వరకు ప్రైవేట్‌ లైఫ్‌ని,  చాలా తక్కువగా  బయట కనిపించే చరణ్‌ ఈ మధ్య వరుసగా ఇతర సినిమాల  ఫంక్షన్స్ లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

710

ప్రస్తుతం చరణ్‌ నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం విడుదలకు  సిద్ధంగా ఉంది. ఇది పాన్‌ ఇండియా  మూవీ.  దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇది విడుదలైతే చరణ్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. పాన్‌ ఇండియా స్టార్‌గా  ఆవిష్కరించబడతాడు. కానీ కరోనా వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. దీంతో రిలీజ్‌ ఎప్పుడనేది క్లారిటీ  లేదు. ఈ నేపథ్యంలో తనని తాను  పాన్‌ ఇండియా స్టార్‌గా  ఆవిష్కరించుకునే ప్లాన్‌  వేగవంతం చేశారు చరణ్‌. 
 

810

ఇప్పటికే ఆయన  శంకర్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా  సినిమా `ఆర్‌సీ15` చేస్తున్నారు. దిల్‌రాజు దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కూడా పాన్‌ ఇండియాని  మించి ఉంటుందట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు  గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు. వీటికి భారీగా పారితోషికాలు కూడా అందుకుంటున్నారని టాక్‌. నిర్మాణ సంస్థలు దాదాపు వంద కోట్ల ఆఫర్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది.

910

ప్రస్తుతం చరణ్‌ చేస్తున్న సినిమాలన్నీ పాన్‌ ఇండియా లెవల్‌లోనూ రూపొందబోతుండటం విశేషం. నెక్ట్స్ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లోనూ సినిమా చేయబోతున్నారనే టాక్‌ ఉంది. ఇలా ప్రతి సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో ప్లాన్‌ చేసుకుంటున్నారు. 

1010

మరోవైపు వరుసగా ఇతర సినిమాల ఈవెంట్లలో పాల్గొనేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.  మొన్న `రౌడీబాయ్స్` ఈవెంట్‌లో పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మరోవైపు తన `ఆర్‌ఆర్‌ఆర్‌` గురించి చర్చించారు. గురువారం `హీరో` చిత్రంలో ఈవెంట్‌లోనూ పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన  హాజరు  కాలేకపోయారు. కానీ  చరణ్‌ మదిలో మాత్రం  పాన్‌ ఇండియా వైడ్‌గా తననని  ప్రమోట్‌ చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories