హరి హర వీరమల్లు స్టోరీ లీక్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్... పవన్ కి మరో మగధీర కానుందా!

Published : Jan 14, 2022, 06:43 PM IST

టాలీవుడ్ టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పాన్ ఇండియా చిత్రం ఇంకా చేయలేదు. ఆయనకంటే వెనక స్టార్డం తెచ్చుకున్న ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.  తాజాగా అల్లు అర్జున్ సైతం పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

PREV
19
హరి హర వీరమల్లు స్టోరీ లీక్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్... పవన్ కి మరో మగధీర కానుందా!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నాని లాంటి టూ టైర్ హీరోలు కూడా పాన్ ఇండియా చిత్రాలపై గురి పెడుతుంటే.. పవన్ నుండి ఆ రేంజ్ మూవీ రాకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచే అంశం. 
 

29
సినిమాలో పవన్‌ చేతికి ధరించి కడియం, ఇతర ఆభరణాలను తమ టీమ్‌ ప్రత్యేకంగా తయారు చేసిందని, కాస్ట్యూమ్‌ కూడా పవన్‌ కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేశామని చెప్పారు. పవన్‌ అవుట్‌ ఫిట్స్ కోసం దాదాపు 100 థాన్ల ఫ్యాబ్రిక్‌ కొనుగోలు చేశామన్నారు.

అభిమానుల పాన్ ఇండియా ఆశలు హరిహర వీరమల్లు మూవీతో పవన్ తీర్చనున్నాడు. నేషనల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పర్ఫెక్ట్ పాన్ ఇండియా చిత్రం . భారత దేశ చరిత్రలో భాగమైన మొఘలుల కాలం నాటి కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. 
 

39

ఇప్పటికే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ లుక్ విడుదల చేశారు. మొఘలుల సంపద దోచుకోవడానికి దాడి చేస్తున్న హరిహర వీరమల్లు మోషన్ పోస్టర్ మెప్పించింది. వీరమల్లుగా పవన్ లుక్ అద్భుతమని చెప్పాలి. అయితే హరిహర వీరమల్లు మూవీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం హీరోయిన్ నిధి అగర్వాల్ లీక్ చేశారు. 
 

49

ఇప్పటి వరకు మొఘలులను ముచ్చెమటలు పాటించే బందిపోటుగా పవన్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని మాత్రమే మనకు తెలుసు. సినిమా మొత్తం 16వ శతాబ్దంలో సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు రెండు భిన్న కాలాల్లో నడిచే కథ అట. 
 

59


నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)హరిహర వీరమల్లు మూవీలో పంచమి అనే ఓ పాత్ర చేస్తున్నారు. కాగా ఆమె నటించిన హీరో మూవీ జనవరి 14న విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిధి అనుకోకుండా అసలు విషయం లీక్ చేశారు. 

69


హరిహర వీరమల్లు రెండు భిన్నకాలాల్లో నడుస్తుందని. పవన్ పీరియాడిక్ లుక్ తో పాటు మోడ్రెన్ గెటప్ లో కనిపిస్తారని అసలు విషయం లీక్ చేశారు. ఇంత వరకు హరిహర వీరమల్లు రెండు భిన్న కాలాలలో నడిచే కథన్న విషయం ఎవరికీ తెలియదు. మొదటిసారి నిధి అగర్వాల్ లీక్ చేశారు. 

79

ఈ లీక్ పవన్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. రామ్ చరణ్ (Ram Charan)ఇదే తరహా కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో 2009లో విడుదలైన మగధీర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. కేవలం తన రెండవ మూవీతో ఈ ఫీట్ సాధించాడు రామ్ చరణ్. మరలా ఇన్నేళ్ల తర్వాత మెగా ఫ్యామిలీ హీరో అయిన పవన్ కళ్యాణ్ అదే తరహా సబ్జెక్టుతో మూవీ చేస్తున్నారు.

89

ఇక హరి హర వీరమల్లు (Hari hara veeramallu)పీరియాడిక్ లుక్ దర్శకుడు క్రిష్ ఇప్పటికే మనకు పరిచయం చేశారు. ఇక మోడ్రన్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక నిధి అగర్వాల్ తో పాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె మోడ్రన్ పార్ట్ లో పవన్ కి జంటగా కనిపించే అవకాశం కలదు.

99

ఇక యాభై శాతానికి పైగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన హరి హర వీరమల్లు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా జనవరి 12న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా మరలా విజృంభిస్తుండగా...హరిహర వీరమల్లు షూటింగ్ సైతం తాత్కాలికంగా ఆపివేశారు.

Read more Photos on
click me!

Recommended Stories