మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉపాసనల పెళ్లి జరిగి 10 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లయినా.. ఇక ఇన్నేళ్శవుతున్నా వారికి పిల్లలు లేరు. వారితోటివారు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల పెళ్లి జరిగి ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరికి మాత్రం పిల్లలు లేక పోవడంతో.. చాలా కాలంగా వారికి రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అటు అభిమానుల్లో కూడా మెగా వారసుడు ఎప్పుడు వస్తాడా అని అంతా ఎదురుచూస్తూ ఉన్నారు. పలు ఇంర్వ్యూలలో కూడా వీరు ఈ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మెగాస్టార్ కు కూడా ఇలాంటి ప్రశ్నలు చాలానే ఎదురయినట్టు సమాచారం.
ఉపాసన కూడా ఈ ప్రశ్నలను చాలా ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసింది. అందుకు ఆమె ప్రతి సారి కూడా తాము తల్లిదండ్రులం అయేందుకు ఇంకా టైమ్ ఉంది.. ఇప్పుడే ఏం కొంపలు మునిగిపోలేదు అన్నట్టు చెప్పేవారు. అంతే కాదు తాము ప్రస్తుతం కెరియర్ పై దృష్టి పెట్టాము అంటూ చెప్పుకొచ్చింది. అటు చరణ్ కూడా ఇలానే ఏదొ ఒకటి చెప్పుతూ వచ్చాడు. చెప్పడం అయితే చెప్పారు కాని మెగా కాంపౌండ్ లో.. ఈలోటు గట్టిగానే కనిపించింది.
ఇక ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారట. మెగా కాంపౌండ్ లో పండగ వాతావరణం స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మెగా సర్కిల్ నుండి అందుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ సతీమణి ఉపాసన తల్లి కాబోతున్నారని రూమర్ గట్టిగా వినిపిస్తోంది.
అంతే కాదు మరో ఐదు ఆరు నెలల్లో మెగా స్టార్ ఇంట్లో బుల్లిమెగాస్టరా్ స్టార్ అడుగు పెట్టబోతున్నాడని వార్తలు ఊపు అందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు కాని... ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అటు ఈ వార్త నిజమో కాదో తెలియదు కాని.. మెగా అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. అంతే కాదు ఈ వార్త నిజం అవ్వాలని కోరుకుంటున్నాం అంటున్నారు. పెళ్ళి జరిగి పది సంవత్సరాలు దాటిన పిల్లలు లేకపోవడంతో.. తమ స్టార్ వారసుడినిచూసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల మీద మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటిస్పందన లేదు. ఈ వార్త నిజం అని వారు ఎప్పుడు చెపుతారా అని మెగా ఫ్యాన్స్ అంతా వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజం అని అనౌన్స్ చేస్తూ.. అభిమానులంతా పండగ చేసుకోవాలని చూస్తున్నారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డౌరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడ. దిని తరువాత గౌతమ్ తినననూరి సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అటు లోకేష్ కనగరాజ్ తో కూడా రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.