Ram Charan: వరుసగా పుకార్లు.. గాలి తీసేసిన రాంచరణ్

Published : Apr 24, 2022, 04:14 PM IST

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

PREV
16
Ram Charan: వరుసగా పుకార్లు.. గాలి తీసేసిన రాంచరణ్
Acharya

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. శనివారం రోజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

26
Ram Charan

మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ప్రచార కార్యక్రమాలని ముందుండి నడిపిస్తున్నారు. తానే స్వయంగా ఆచార్య చిత్రం కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో రాంచరణ్ ఆచార్య చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

 

36
Ram Charan

ముందుగా ఆచార్య చిత్రంలో నేను ఒక నిర్మాతగా మాత్రమే అసోసియేట్ అయ్యాను. ఆ తర్వాతే సిద్ద పాత్ర గురించి కొరటాల శివ గారు చెప్పారు. ముందుగా ఈ పాత్ర కేవలం 15 నిమిషాలకు మాత్రమే పరిమితం చేయాలని అనుకున్నాం.. కానీ ఆ తర్వాత 45 నిమిషాల వరకు నా రోల్ వెళ్ళింది. 

46
Ram Charan

ఆచార్య చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం లేదు. ఇప్పటికైతే ఇతర భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన లేదని రాంచరణ్ అన్నారు. హిందీలో రిలీజ్ చేస్తాం.. కానీ ఇప్పట్లో కాదు. ఆచార్యగా చిరంజీవి గారు.. సిద్ద పాత్రలో నేను ఈ చిత్రం ఓకె అంశం కోసం పోరాడతాం. అది ఏంటనేది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అని రాంచరణ్ తెలిపాడు. 

 

56
Ram Charan

ఇక తన తదుపరి చిత్రాల గురించి రాంచరణ్ స్పందించాడు. శంకర్ గారి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపిస్తాను.. మీ అందరికి అది తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోతున్నా. అది అద్భుతమైన సబ్జెక్ట్ అని రాంచరణ్ అన్నారు. 

66
Ram Charan

ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. కథ గురించి కూడా అనేక వార్తలు వచ్చాయి. ఇది స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న చిత్రం కాదని రాంచరణ్ పుకార్లకు గాలి తీసేశారు. రాంచరణ్ కోసం గౌతమ్ వైవిధ్యమైన కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో తన మరిన్ని చిత్రాల గురించి ప్రకటన ఉంటుందని రాంచరణ్ తెలిపారు. 

 

click me!

Recommended Stories