మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న విడుదలై వసూళ్ల వేటలో వెనుకబడుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో అభిమానులని అలరించలేకపోయింది. కానీ శంకర్ రీసెంట్ మూవీస్ కంటే బెటర్ అని,చరణ్ అప్పన్న పాత్రలో అదరగొట్టాడని ప్రశంసలు దక్కుతున్నాయి.
గేమ్ ఛేంజర్ చిత్ర 2 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ చిత్రం తొలిరోజు వరల్డ్ వైడ్ గా 50 కోట్లకి పైగా షేర్ సాధించింది. ఇక రెండవ రోజు బాగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. రెండవ రోజు ఈ చిత్రం 17 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దీనితో 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు 72 కోట్లకి చేరుకున్నాయి.
గేమ్ ఛేంజర్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 220 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే గేమ్ ఛేంజర్ మూవీ ఇంకా 150 రాబట్టాలి. ఫుల్ రన్ లో ఎంత మొత్తం సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ట్రెండ్ చూస్తుంటే నష్టాలు తప్పేలా లేవు. అయితే ఆ లాస్ ఎంత వరకు తగ్గుతుంది అనేది రానున్న మూడు రోజుల్లో తేలుతుంది.
రానున్న మూడు రోజులు చాలా కీలకం. భోగి, సంక్రాంతి, కనుమ సెలవు రోజులు కాబట్టి నష్టాలు తగ్గించుకోవాలంటే ఈ మూడు రోజులు జరిగే బిజినెస్ పైనే ఆధారపడి ఉంటుంది. మొత్తంగా శంకర్ కి ఫ్లాప్ చిత్రాలు కొనసాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ పెంచుకోవాలి అని భావించిన చరణ్ ఆశలు ఫలించలేదు.