తల లేని మనిషి కథతో ‘డాకు మహారాజ్‌’ ప్రీక్వెల్‌ ప్రకటన

First Published | Jan 12, 2025, 7:15 PM IST

బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో, నిర్మాతలు ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలోని గుర్రంపై ఉన్న తలలేని వ్యక్తి కథ ఆధారంగా ప్రీక్వెల్ తీయనున్నట్లు తెలిపారు.


 బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ మూవీ 'డాకు మహారాజ్‌'. సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ లేకపోయినప్పటికీ,   రిలీజ్ తర్వాత  బాక్సాఫీస్ వద్ద డాకు జోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ నందమూరి అభిమానులకు ఓ సర్​ప్రైజ్ న్యూస్​ చెప్పారు. సినిమా మంచి టాక్ దక్కించుకోవడం వల్ల మూవీటీమ్ ఆదివారం ప్రెస్​మీట్ నిర్వహించింది. 


ప్రెస్ మీట్ లో పాల్గొన్న నిర్మాత నాగవంశీకి ​'డాకు మహారాజ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాగవంశీ జవాబిచ్చారు. 'సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో గుర్రంపై చూపిన ఓ సీన్​ను బేస్ పాయింట్ చేసుకొని ప్రీక్వెల్ తీసేందుకు ప్రయత్నిస్తాం' అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఖాతాలో మరో హిట్ ఖాయమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



నిర్మాత ఎస్ నాగ వంశీ ఈ సినిమా ప్రీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ.... “గుర్రం మీద కూర్చున్న తల లేని వ్యక్తి కథను సినిమాలో చూపించాం. తల లేని మనిషి కథతో డాకు మహారాజ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం’’ అని నాగ వంశీ తెలిపారు. సీక్వెల్ ఆలోచనను తాను షేర్ చేసుకున్నానని, చిత్ర నిర్మాత ఎస్ నాగ వంశీ దాని గురించి ఆనందంగా ఉన్నారని బాబీ కొల్లి చెప్పారు. ఈ చిత్ర విజయోత్సవాన్ని అనంతపురంలో చిత్ర టీమ్ నిర్వహించి తేదీని ప్రకటిస్తామని వంశీ ప్రకటించారు. 
 


 'డాకు మహారాజ్'లో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్​లో బాలయ్యతో కలిసి ఆడిపాడారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. కాగా, 'డాకు మహారాజ్' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

 డాకూ మహారాజ్  థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో సినిమా వస్తుంది? అంటే...ఏ స్దాయి హిట్ అనే దానిపై ఆధారపడుతుంది అంటున్నారు. చాలా  సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో వస్తున్నాయి. 'డాకు మహారాజ్' విషయంలో కూడా అదే జరగవచ్చని అంటున్నారు. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ సినిమా ఓటిటికు రావచ్చు అని తెలుస్తోంది. అయితే పెద్ద సక్సెస్ అయితే మాత్రం 45 రోజుల తర్వాతే ఓటిటిలోకి వస్తుంది. 
 

చిత్రం కథ ఏంటి
 
సివిల్ ఇంజీనీర్ సీతారం(బాలయ్య)..చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని  పోతూంటాడు. ఎన్నో గ్రామాలకు అతను దేవుడుగా మారతాడు. అలాంటి సీతారాం జీవితంలో జరిగిన ఓ సంఘటనతో డాకూ మహారాజ్ గా టర్న్ అవుతాడు. జీపు దిగి గుర్రం ఎక్కి డాకూగా తిరుగుతూంటాడు. ఆ  పరిస్దితులు ఏమిటి, అతనికి చిన్న పాప వైష్ణవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆమెను రక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి,  ప్రశాంతంగా సాగిపోతున్న  అతని జీవితాన్ని సమూలంగా మార్చిన సంఘటన ఏమిటి వంటి విషయాలుకు సమాధానమే ఈ సినిమా కథ.

Latest Videos

click me!