చిరుత మూవీకి రామ్ చరణ్ తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. వరుస పాన్ ఇండియా సిమాలతో 100 కోట్ల  రెమ్యూనరేషన్ వరకు ఎదిగాడు. మరి ఆయన తన ఫస్ట్ మూవీ చిరుతకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..? 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వరుస పాన్ ఇండియా మూవీస్ తో రచ్చ చేస్తున్నాడు. చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెలలో ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈక్రమంలోన సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

మెగా వారసత్వంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్... తన సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. మెగా సర్కిల్ టాలీవుడ్ వరకే ఉండగా.. రామ్ చరణ్ ట్రీపుల్ ఆర్ తో పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాడు. హాలీవుడ్ దర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. 

ఈక్రమంలో ఆయన త్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్ వరకూ వెళ్లి వచ్చారు. ఇక ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు చరణ్. తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచినట్టు తెలుస్తోంది. సినిమాకు రామ్ చరణ్ 100 కోట్ల వరకూ వసూలు చేస్తున్నాడట. 
 


ఇక ప్రస్తుతం 100 కోట్లు తీసుకుంటున్న చరణ్.. తన ఫస్ట్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..? చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు కాని.. పర్వాలేదు అనిపించింది.  రామ్ చరణ్ ను హీరో మెటీరియల్ అని గుర్తింపు ఇచ్చింది. 

చిరుత( కుర్రాడు లోక్లాస్)

కాగా అశ్వినీదత్ నిర్మించిన ఈసినిమాలో రామ్ చరణ్ రెమ్యూనరేషన్ పై పెద్ద చర్చ జరిగిందట. పూరీకి  చరణ్ డెబ్యూ మూవీ అవకాశం ఇచ్చాడు మెగాస్టార్. అయితే సినిమాను నిర్మించిన అశ్వినీ దత్ కు మాత్రం చరణ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలో అర్ధం కాలేదుట. దాంతో చరణ్ ను డైరెక్ట్ గా అడిగారట అశ్వినీ దత్. 

అయితే రామ్ చరణ్ నవ్వి ఏం సమాధానం చెప్పలేదట. దాంతో ఆయన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్ళి అడిగారట. దానికి చిరంజీవి కూడా నవ్వుతూ.. ఎంతో అంత ఇవ్వండి అని అన్నారట. దాంతో అశ్వినీ దత్.. అప్పట్లోనే రామ్ చరణ్ కు 50 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. 

అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఫస్ట్ సినిమా చిరుత కోసం రామ్ చరణ్ 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన వందలకోట్ల స్థాయికి ఎదిగారు. శంకర్ డైరెక్షన్ లో.. గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. 

ఇక ఈసినిమా తరువాత చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈమూవీ ఓపెనింగ్ రీసెంట్ గా జరిగింది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. బుచ్చిబాదు సినిమా తరువాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఎవరితోనో త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

Latest Videos

click me!