విశ్వంభర సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సురభి, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా సైతం కీలక రోల్స్ చేస్తున్నారు. విశ్వంభర చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్రిష ఖాతాలో అజిత్ మూవీ సైతం ఉంది.
మరోవైపు మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి మూవీకి సిద్ధం అవుతున్నారు. ఆయన పొడవాటి జుట్టు, గుబురు గడ్డంలో కనిపిస్తున్నారు. మహేష్ బాబు గతంలో ఎన్నడూ పూర్తి స్థాయిలో గడ్డం పెంచలేదు. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ బాబును రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తాడనే చర్చ నడుస్తోంది.