త్రివిక్రమ్‌ని ఉచ్చులోకి లాగిన పూనమ్‌ కౌర్‌, సంచలన పోస్ట్, టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ప్రకంపనలు

First Published | Sep 17, 2024, 7:12 PM IST

జానీ మాస్టర్‌ వివాదం టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంటే, ఇప్పుడు మరో కొత్త రచ్చ లేపింది పూనమ్‌ కౌర్‌. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ పేరుని ప్రస్తావిస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. 
 

Hema Committee

 లైంగిక వేధింపుల ఆరోపణలు మొన్నటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమని ఊపేసింది. మాలీవుడ్‌లో వర్క్ ప్లేస్‌లో ఆడవాళ్లకి రక్షణ లేదని, వేధింపులకు గురవుతున్నారని హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ దుమారం రేపిన విషయం తెలిసిందే. పవర్‌ గ్రూపులున్నాయంటూ హాట్‌ కామెంట్‌ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

Jani Master

 ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్‌లోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. డాన్సర్స్ అసోసియేషన్‌కి చెందిన లేడీ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అంతేకాదు పోలీస్‌ కంప్లెయింట్‌ కూడా ఇచ్చారు. షూటింగ్‌ల్లో తనని వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. ఈ కేసు టాలీవుడ్‌ని ఊపేస్తుంది. ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్‌కి గురి చేస్తుంది. దీనిపై ఫిల్మ్ ఛాంబర్‌ సైతం స్పందించింది. విచారణ జరుగుతుందని, రిపోర్ట్ ని బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ని డాన్సర్స్ అసోసియేషన్స్‌ అధ్యక్షుడు స్థానం నుంచి తొలగించారు. అలాగే జనసేన పార్టీ కార్యక్రమాల నుంచి ఆయన్ని పక్కన పెట్టారు పవన్‌.


Poonam Kaur

ఓ వైపు పోలీసు కేసు విచారణ నడుస్తుండగా, మరోవైపు ఫిల్మ్ ఛాంబర్‌ నుంచి సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ కి సంబంధించిన టీమ్‌ సైతం విచారణ చేడుతుంది. ఈ కేసులో చాలా అంశాలున్నాయని, లైంగిక వేధింపులే కాదు, ఇంకా చాలా ఉన్నాయని ఈ రోజు ప్రెస్‌ మీట్‌లో నటి ఝాన్సీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో దుమారం రేపింది నటి పూనమ్‌ కౌర్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పేరుని ప్రస్తావిస్తూ సంచలన పోస్ట్ పెట్టింది. 

Poonam Kaur

పూనమ్‌ కౌర్‌ గతంలోనూ పరోక్షంగా త్రివిక్రమ్‌, పవన్‌ కళ్యాణ్‌లపై ఆరోపణలు చేసింది. గురూజీ అంటూ ఆయన మోసం చేశాడని, తనని తొక్కేశారని ఆరోపణలు చేస్తూ వచ్చింది. అలాగే ఓ రాజకీయ నాయకుడు అంటూ పవన్‌పై కూడా ఆమె ఆరోపణలు చేస్తూ వచ్చింది. వాళ్లు తనని మోసం చేశారని, వాడుకుని వదిలేశారని ఆరోపించింది.

తమకు అనుకూలమైన వారికి అవకాశాలిస్తూ, తనని మోసం చేశారంటూ ఆమె ఆరోపిస్తూ వచ్చింది. అయితే ఎప్పుడూ ఆమె వారి పేర్లు ప్రస్తావించలేదు. కానీ విషయం అర్థమయ్యేలా, వాళ్లు ఎవరో జనాలకు అర్థమయ్యేలా తన పోస్ట్ లు పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా త్రివిక్రమ్‌ పేరునే ప్రస్తావించింది. 
 

జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఛాంబర్‌ శరవేగంగా చర్యలకు దిగుతున్న నేపథ్యంలో `మా`ని ప్రశ్నించింది పూనమ్‌ కౌర్. గతంలో త్రివిక్రమ్‌పై పలు మార్లు ఫిర్యాదు చేశాను. ఎందుకు విచారించలేదు, చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించింది. నాతోపాటు చాలా మందికి రాజకీయ బాధలు ఉండేవి కాదు. దీని కారణంగా ఇండస్ట్రీ నుంచి నేను సైలెంట్‌గానే విస్మరించబడ్డాను. నేను కాల్‌ టాండ్ ఇచ్చాను, పెద్దలకు ఫిర్యాదు చేశాను. దర్శకుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను` అంటూ ట్వీట్‌ చేసింది పూనమ్‌ కౌర్‌.

ఓ వైపు జానీ మాస్టర్ వివాదంపై రచ్చ నడుస్తున్న సమయంలో పూనమ్‌ కౌర్‌ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఇది మరింత రచ్చ అవుతుంది. టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఈ సరికొత్త వివాదం ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి. 
 

Poonam Kaur

`ఒక వి చిత్రం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పూనమ్‌ కౌర్‌. హీరోయిన్‌గా మెప్పించింది. `శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్‌`, `గగనం`, `బ్రహ్మీగాడి కథ`, `ఆడు మగాడ్రా బుజ్జి`, `పొగ`, `సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌, `ఎటాక్`, `నాయకి`, `శ్రీనివాస కళ్యాణం`, `నెక్ట్స్ ఏంటి?` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తమిళంలో ఒకటి అర సినిమాలు చేస్తుంది. తెలుగుకి దూరంగానే ఉంటుంది. ఇక్కడ అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె ఆథ్యాత్మిక విషయాల్లో, రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. యాక్టివిస్ట్ గా పని చేస్తుంది. 
 

Latest Videos

click me!