Ram Charan: రామ్ చరణ్ జాతకంలో బ్యాడ్ టైమ్ నడుస్తుందా? మెగా పవర్ స్టార్ ఎప్పుడు కోలుకుంటాడు? నిజమెంత?

Published : Jul 31, 2026, 04:02 PM IST

Ram Charan: రీసెంట్ గా రామ్ చరణ్ ఆపరేషన్ కోసం హాస్పిటల్ లో చేరాడు. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మెగా పవర్ స్టార్ కు ఎందుకు ఇలా జరుగుతుందంటూ బాధపడుతున్నారు. రామ్ చరణ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుందా?

PREV
16
రామ్ చరణ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుందా?

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్‌గా వెలుగొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితిని ఫేస్ చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ వేదికపై మెరిసిన ఒక నటుడికి, ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను ప్రస్తుతం చరణ్ ఎదుర్కోవలసి వస్తుంది. వరుసగా ఎదురవుతున్న పరాజయాలు, అనూహ్యమైన గాయాలు చూస్తుంటే... "చరణ్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తుందా?" అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

26
ఆస్కార్ మెరుపుల తర్వాత 'గేమ్ ఛేంజర్' షాక్

ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' చిత్రంపై భారీ అంచనాలు నమోదయ్యాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. శంకర్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, చరణ్ నటన ఆకట్టుకున్నప్పటికీ... కథనంలో లోపాలు, మూవీ ఆలస్యమవడం,ఇతర కారణాలు సినిమా రిజల్ట్ నై గట్టి ప్రభావాన్ని చూపించాయి. గ్లోబల్ ఇమేజ్ వచ్చిన తర్వాత పడిన ఈ మొదటి దెబ్బ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

36
'పెద్ది' చిత్రం మిగిల్చిన గాయం..

గేమ్ ఛేంజర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పెద్ది' సినిమాపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ప్రయాణం కూడా చరణ్‌కు అంత సులభంగా సాగలేదు: ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ కంటికి తీవ్రమైన గాయమైంది. దీంతో కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. చరణ్ కంటికి ఏమౌతుందా అని చిరంజీవి, మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా చాలా భయపడ్డారు. కానీ ఆ గాయం నుంచి బయటపటి రామ్ చరణ్ సినిమాను కంప్లీట్ చేశాడు.

46
నిరాశపరిచిన పెద్ది బాక్సాఫీస్ రిజల్ట్..

పెద్ది సినిమా చాలా కష్టపడి తెరకెక్కించారు. ఈమూవీ లో చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అయినప్పటికీ... కమర్షియల్ పరంగా 'పెద్ది' అనుకున్న స్థాయి వసూళ్లను సాధించలేకపోయింది. ఆర్ఆర్ఆర్, పుష్ప రేంజ్ హిట్‌ను ఆశించిన అభిమానులకు ఇది మరో నిరాశ కలిగించే అంశంగా మారింది.దాంతో ప్రస్తుతం అందరి చూపు సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ పై ఉంది. ఈసినిమాపై ఆశలన్నీ పెట్టుకున్నారు మెగా అభిమానులు.

56
మెగా పవర్ స్టార్ చేతికి సర్జరీ

తాజాగా రామ్ చరణ్ చేతికి సర్జరీ కోసం కోయంబత్తూర్ హాస్పిటల్ లో చేశారు. ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేయడంతో అభిమానుల ఆందోళన రెట్టింపయింది. వరుసగా ఫ్లాప్‌లు, దానికి తోడు కంటి గాయం, ఇప్పుడు చేతికి సర్జరీ... ఇలా ఒకదాని వెంట ఒకటి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు చూసి "చరణ్‌కు ఏమైంది? నిజంగానే కాలం కలిసిరావడంలేదా?" అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చరణ్ జాతకంప్రకారం ఇప్పుడు టైమ్ బాలేదుమో అని కొంత మంది అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియదు.

66
నిజంగానే బ్యాడ్ టైమ్ నడుస్తుందా?

సినిమా పరిశ్రమలో గెలుపోటములు, గాయాలు సహజం. చిరంజీవి వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో హెచ్చుతగ్గులను చూశారు. 'మగధీర' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా 'ఆరెంజ్' వంటి పరాజయాలను, 'తుఫాన్' వంటి డిజాస్టర్లను దాటుకుని 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' వంటి అద్భుతమైన సినిమాలతో తనను తాను నిరూపించుకున్నారు. ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమైన ఒక చిన్న విరామం మాత్రమే. శారీరకంగా కోలుకుని, సరైన కథలను ఎంచుకుంటే... రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.

సుకుమార్ సినిమాపై అభిమానుల ఆశలు..

త్వరలో రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. రంగస్థలం సినిమాతో ఈ ఇద్దరు సృష్టించిన చరిత్ర గురించి అందరికి తెలిసిందే. ఇక ఈసారి అంతకు మించి సినిమాను తీయ్యబోతున్నట్టు సమాచారం. సుకుమార్ మేకింగ్ లో పుష్ప సినిమాలు ఏ రేంజ్ హిట్ కొట్టాయో కూడా అందరికి తెలుసు. ఇక ఈసినిమా తో అయినా చరణ్ కు లక్కు కూడా మారుతుందన్న నమ్మకంతో ఉన్నారు అంత. చూడాలి మరి ఈసారి మెగా పవర్ స్టార్ ను సుకుమార్ ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనేది.

Read more Photos on
click me!

Recommended Stories